IND vs SL: కృనాల్ పాండ్యకు కొవిడ్ పాజిటివ్.. టీ20 వాయిదా

IND vs SL: శ్రీలంకలో పర్యటనలో ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. కృనాల్ పాండ్యకు కరోనా బారిన పడ్డాడు. దీంతో ఇవాళ జరగాల్సిన భారత్, శ్రీలంక రెండో టీ20 వాయిదా పడింది. ప్రస్తుతం క్రికెటర్లంతా బయో బుడగలోనే ఉంటున్నారు.నేటి మ్యాచును బుధవారానికి, గురువారం జరగాల్సిన పోరును శుక్రవారానికి వాయిదా వేస్తారని సమాచారం. కృనాల్ పాండ్యకు పాజిటివ్ రావడంతో ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సిన సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా పైనా ప్రభావం పడనుంది.
బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. 'అవును, కృనాల్‌కు పాజిటివ్ వచ్చింది. నేటి టీ20 మ్యాచ్ వాయిదా పడింది. భారత బృందంలోని ఇతర ఆటగాళ్ల ఆర్‌టీ పీసీఆర్ రిపోర్ట్ రావాల్సిఉంది. సాయంత్రం 6 గంటలకు అవి అందుతాయి. ఇంకెవరికీ వైరస్ సోకని పక్షంలో బుధవారం మ్యాచ్ ఉండొచ్చు' అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com