MS Dhoni: పుట్టినరోజు శుభాకాంక్షలు మిస్టర్ కూల్

ఇవాళ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ బర్త్‌డే.తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ తలైవా. 2020లో ఇంటర్నేషనల్ కెరీర్‌కు ధోనీ గుడ్ బై చెప్పాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనీ. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీమీండిమా 2007లో మొదటి T20 వరల్డ్ కప్ ట్రోఫీని
గెలుచుకుంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మాత్రమే ఆడుతున్నాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ లో ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ధోనీ తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను గెలిపించాడు. ఐపీఎల్‌లో చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీకి ఎన్నో రికార్డులు ఉన్నాయి.
ఇక ధోనీ టెస్టు క్రికెట్‌లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా 60 మ్యాచ్‌లు ఆడాడు. అందులో జట్టు 27 గెలిచింది. 18 ఓడిపోయింది. వన్డేల్లో,ధోనీ టీమ్ ఇండియాకు 200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో భారత జట్టు 110 మ్యాచ్‌లు గెలిచి 74 ఓడిపోయింది. అదే సమయంలో T20 ఇంటర్నేషనల్‌లో ధోని 72 మ్యాచ్‌లలో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఆడాడు. ఇందులో జట్టు 42 మ్యాచ్‌లలో విజయం సాధించింది. జట్టు 28 మ్యాచ్‌లలో ఓడిపోయింది.
మరోవైపు ధోనీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు అభిమానులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ఫ్యాన్స్ ధోని కటౌట్లు ఏర్పాటు చేశారు. చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో భారత మాజీ కెప్టెన్ 41 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఇందులో ధోని హెలికాప్టర్ షాట్ ఫొటోను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఓ అభిమాని ఈ కటౌట్ ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు. దీంతో వేల మంది ధోని ఫొటోకు సలాం చేస్తూ,కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఏడు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ధోనీ కటౌట్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో కేరళలో 35 అడుగుల కటౌట్‌లు, చెన్నైలో 30 అడుగుల కటౌట్‌లను ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com