TEAM INDIA: టీమిండియా "మిషన్ టీ 20 ప్రపంచకప్"

TEAM INDIA: టీమిండియా మిషన్ టీ 20 ప్రపంచకప్
X
ఆసియా కప్‌లో టీమిండియా పక్కా వ్యూహం... టీ 20 ప్రపంచకప్ లక్ష్యంగా మార్పులు.. గౌతం గంభీర్- సూర్యా పక్కా ప్రణాళికలు

ఆసి­యా కప్‌ టీ20 టో­ర్నీ­లో భా­ర­త్‌ బోణీ కొ­ట్టిం­ది. దు­బా­య్ ఇం­ట­ర్నే­ష­న­ల్ స్టే­డి­యం వే­ది­క­గా యూ­ఏ­ఈ­తో జరి­గిన మ్యా­చ్‌­లో భా­ర­త్ ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. తొ­మ్మి­ది వి­కె­ట్ల తే­డా­తో గె­లు­పొం­దిం­ది. టా­స్‌ ఓడి­పో­యి తొ­లుత బ్యా­టిం­గ్‌­కు ది­గిన యూఏఈ జట్టు 13.1 ఓవ­ర్ల­లో 57 పరు­గు­ల­కు కు­ప్ప­కూ­లిం­ది. భారత బౌ­ల­ర్ల­లో కు­ల్దీ­ప్‌ యా­ద­వ్‌ నా­లు­గు వి­కె­ట్ల­తో రా­ణిం­చా­డు. శి­వ­మ్‌ దుబే మూడు, బు­మ్రా, అక్ష­ర్‌­ప­టే­ల్‌, వరు­ణ్‌ చక్ర­వ­ర్తి తలో వి­కె­ట్‌ తీ­శా­రు. ఇక 58 పరు­గుల లక్ష్య ఛే­ద­న­లో బరి­లో­కి వచ్చిన భా­ర­త్ కే­వ­లం 4.3 ఓవ­ర్ల­లో­నే ఒక వి­కె­ట్‌ కో­ల్పో­యి 60 పరు­గు­లు చే­సిం­ది. తొ­మ్మి­ది వి­కె­ట్ల తే­డా­తో యూ­ఏ­ఈ­ని ఓడిం­చిం­ది. అయి­తే ఈ మ్యా­చు­లో గౌతీ-సూ­ర్యా జోడీ ప్ర­యో­గా­ల­తో ముం­దు­కు సా­గిం­ది. వచ్చే టీ 20 ప్ర­పం­చ­క­ప్ లక్ష్యం­గా ఈ జోడీ ప్ర­యో­గా­లు ఆరం­భిం­చిం­ది.

తొలి మ్యాచ్‌లోనే ప్రయోగాలు

వచ్చే ఏడా­ది టీ20 ప్ర­పం­చ­క­ప్‌ సన్నా­హ­కం­గా భా­వి­స్తో­న్న ఆసి­యా కప్‌ తొలి మ్యా­చ్‌­తో­నే ప్ర­ధాన కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్‌ - కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ తమ మా­ర్క్‌­ను చూ­పిం­చా­రు. యూఏఈ వంటి చి­న్న జట్టు అయి­నా సరే పూ­ర్తి­స్థా­యి బలం­తో­నే బరి­లో­కి దిం­పి వి­జ­యం సా­ధిం­చా­రు. బ్యా­టిం­గ్‌ ఆర్డ­ర్‌­లో మా­ర్పు­ల­తో మొ­ద­లు­పె­ట్టా­రు. చి­న్న­నా­టి స్నే­హి­తు­లు అభి­షే­క్ శర్మ - శు­భ్‌­మ­న్‌ గి­ల్‌ ఓపె­న­ర్లు­గా వచ్చా­రు. జి­తే­శ్‌ శర్మ­ను తీ­సు­కుం­టా­ర­ని భా­వి­స్తే.. సం­జు­కే ఛా­న్స్ ఇచ్చా­రు. బ్యా­టిం­గ్ చేసే అవ­కా­శం రా­క­పో­యి­నా అత­డి­కి జట్టు­లో స్థా­నం కల్పిం­చ­డం­తో కా­న్ఫి­డె­న్స్‌ పెం­చి­న­ట్లైం­ది. ఇక వన్‌­డౌ­న్‌­లో కె­ప్టె­న్ సూ­ర్య వచ్చా­డు. దుబాయ్‌ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం. అలాగని పేస్‌నూ తక్కువ చేయడానికి లేదు. తొలి మ్యాచ్‌లో కేవలం ఒకేఒక్క స్పెషలిస్ట్ పేసర్‌ను మాత్రమే ఆడించారు. కుల్‌దీప్‌ ఛాన్స్‌ కొట్టేసి ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

కొత్త బంతి పాండ్యాకు

జస్‌­ప్రీ­త్ బు­మ్రా­తో­పా­టు పేస్ ఆల్‌­రౌం­డ­ర్లు­గా ఉన్న హా­ర్ది­క్ పాం­డ్య, శి­వ­మ్‌ దూ­బె­ను మే­నే­జ్‌­మెం­ట్ ఆడిం­చిం­ది. అనూ­హ్యం­గా కె­ప్టె­న్ సూ­ర్య కొ­త్త బం­తి­ని హా­ర్ది­క్‌­కు ఇచ్చా­డు. పసి­కూ­న­పై బు­మ్రా­ను ఆడిం­చ­ర­ను­కుం­టే... పవ­ర్‌­ప్లే­లో­నే మూడు ఓవ­ర్లు వే­యిం­చ­డం గమ­నా­ర్హం. జట్టు­లో ఎం­త­మం­ది ఆల్‌­రౌం­డ­ర్లు ఉంటే అంత బలం. ఇప్ప­టి­కే టీ­మ్‌­ఇం­డి­యా­లో ము­గ్గు­రు ఆల్‌­రౌం­డ­ర్లు ఉం­డ­గా.. ఇప్పు­డు అభి­షే­క్ శర్మ కూడా చే­రా­డు. చి­న్న జట్టు కా­బ­ట్టి పె­ద్ద టె­న్ష­న్‌ లే­కుం­డా బౌ­లిం­గ్ చే­శా­డు. పా­క్‌­తో పో­రు­లో ఎలా ఆడ­తా­డో చూ­డా­లి. రవీం­ద్ర జడే­జా లో­టు­ను తీ­రు­స్తూ అక్ష­ర్ పటే­ల్ తన స్థా­నా­న్ని సు­స్థి­రం చే­సు­కు­న్నా­డు. ­మ్యా­చ్‌­కు, ప్ర­తి సి­రీ­స్‌­కు భి­న్నం­గా ఆలో­చ­న­లు చే­య­డం గౌ­త­మ్‌ గం­భీ­ర్‌­కు అల­వా­టు. అది జట్టు ఫలి­తా­ల­పై తా­త్కా­లి­కం­గా ప్ర­భా­వం చూ­పి­నా.. సు­దీ­ర్ఘ­కా­లం­లో మె­రు­గ్గా ఉం­టా­య­నే­ది అతడి భావన. ఇప్పు­డు ఆసి­యా కప్‌­లో పా­కి­స్థా­న్‌, అఫ్గా­ని­స్థా­న్‌ నుం­చి కా­స్త ప్ర­తి­ఘ­టన తప్పి­తే.. మి­గ­తా జట్ల నుం­చి ము­ప్పు ఉం­డ­క­పో­వ­చ్చు. అయితే భారత జట్టు ముందుముందు కూడా ఈ ప్రయోగాలు కొనసాగిస్తుందేమో చూడాలి.

Tags

Next Story