టీమిండియా ఆటగాళ్ల చదువులు..ఆ క్రికెటర్ తప్ప అంతా ఇంటరే..!

Team India Players
Team indian cricketers: క్రీడాకారులు అనేక మంది అటు చదువు ఇటు ఆటలు రెండు బ్యాలెస్స్ చేయడం చాలా కష్టం. క్రీడలు, చదువులు ఈ రెండింటిలో ఒక దాని కోసం మరోకటి త్యాగం చేయాల్సిందే. క్రీడాకారులు తమకు ఇష్టమైన ఆట కోసం చదువులను మధ్యలోనే అపేసి ఇప్పుడు కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఇన్స్ఫైరిషన్ గా నిలుస్తున్నారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఎడ్యూకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించిన వివరాలు చాలా మందికి తెలియదు. మన అభిమాన క్రికెటర్లు ఏం చదివారో చూద్దాం.Team indian cricketers
సచిన్
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో 12వ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు.
ద్రవిడ్
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ చేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్రవిడే. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలీజిలో పీజీ పూర్తి చేశాడు.
అనిల్ కుంబ్లే
దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు
జహీర్ ఖాన్
మాజీ పేసర్ జహీర్ ఖాన్ 12వ తరగితి వరకే చేశాడు.
లక్ష్మణ్
వీవీఎస్ లక్ష్మణ్ ఎంబీబీఎస్‌ను మధ్యలోనే వదిలేశాడు.
సౌరవ్ గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిగ్రీ చేశాడు
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డిగ్రీ పూర్తి చేశాడు
గౌతమ్ గంభీర్
మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ డిగ్రీ పూర్తి చేశారు.
యువ రాజ్ సింగ్
మాజీ ఆల్‌రౌండర్ యువ రాజ్ 12వ తరగతి వరకే చదువుకున్నాడు.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ డిగ్రీ పూర్తిచేశాడు.
ధోనీ బీకామ్ డిగ్రీ పట్టా పొందాడు. మహీ అరంగేట్రం ఆలస్యం కావడంతో.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలడు.
రాహుల్
టీమిండియా ఆటగాడు లోకేశ్ రాహుల్ డ్రిగ్రీ పూర్తి చేశాడు.
విరాట్ కోహ్లీ
కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 వ తరగతి వరకు చదువుకున్నాడు.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ
రోహిత్ శర్మ కూడా 12వ వరకు చదివాడు. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ కూడా ఇంటర్ వరకే చదివారు.
ఛతేశ్వర్ పుజారా
నయా వాల్ ఛతేశ్వర్ పుజారా కరస్పాండెన్స్ ద్వారా బీబీఏ పూర్తిచేశాడు.
వైస్ కెప్టెన్ అజింక్య రహానె
భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె డిగ్రీ పట్టా అందుకున్నాడు.
హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా స్కూల్ వరకే చదివారు.
ఆర్ అశ్విన్
అశ్విన్ ఉన్నత చదువులు చదివాడు. చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బిటెక్ డిగ్రీ పొందాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com