TEAMINDIA: రెండో టెస్టుకు జట్టులో మార్పులు తథ్యం

భారత్ - దక్షిణాఫ్రికా తొలి టెస్టులో సఫారీలు అనూహ్యంగా గెలిచారు. భారత మీడియా ముందే ఓటమిని ఖరారు చేసిందని, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగుల లక్ష్యంతో ఉన్నప్పుడు, దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించి టీమ్ ఇండియాను 93కే పరిమితం చేసి సంచలన విజయం సాధించారు. అయితే రెండో టెస్టులో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచులో ఎలా అయినా విజయం సాధించాలని చూస్తున్న భారత్.. అస్త్ర శస్త్రాలతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ కీలక మ్యాచ్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దాదాపు దూరమైనట్టు సమచారం. జట్టుతో పాటు గిల్ కూడా ఇప్పటికే గువాహటికి వెళ్లాడు. అయితే మెడ గాయం కారణంగా గిల్ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా గువాహటిలో రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టెస్ట్ సిరీస్‌ను టీమిండియా సమం చేయగలదు. నవంబర్ 22 నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఈ కీలక మ్యాచ్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దాదాపు దూరమైనట్టు సమచారం. జట్టుతో పాటు గిల్ కూడా ఇప్పటికే గువాహటికి వెళ్లాడు. అయితే మెడ గాయం కారణంగా గిల్ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే . గిల్ ఆరోగ్యం విషయంలో వైద్య బృందం తుది నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అతడికి విశ్రాంతి ఇవ్వాలనే అభిప్రాయం టీమ్ మేనేజ్మెంట్లో కనిపిస్తోంది. ఇక, గిల్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఆడకపోవచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడట. దీంతో అతడు అందుబాటులో ఉండేది కూడా అనుమానంగా మారింది. గిల్ గైర్హాజరీ కారణంగా రిషభ్ పంత్ ఈ టెస్ట్‌కు నాయకత్వం వహించే అవకాశాలు కనబడుతున్నాయి. గిల్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి, రజత్ పటిదార్‌లలో ఒకరికి అవకాశం లభించవచ్చు .
ఇక, కుల్దీప్ స్థానంలో ఆడే స్పిన్నర్ ఎవరనే విషయంలో పూర్తి స్పష్టత లేదు. తుది జట్టు విషయంలో ఇప్పటికి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఏదేమైనా గువాహటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది.
హీలీ కీలక వ్యాఖ్యలు
సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్ట్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ భారత వ్యూహాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. భారత్ ఇలాంటి తీవ్రమైన టర్నింగ్ పిచ్‌లను ఎందుకు సిద్ధం చేస్తోంది, వాటిని సొంత బ్యాటర్లు కూడా ఎదుర్కోలేకపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. విల్లో టాక్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో హీలీ మాట్లాడుతూ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు తనకు అర్థం కావడం లేదన్నారు. నేటి క్రికెట్లో ఎక్కడైనా స్పిన్‌కు ఎదురు నిలవడం కష్టమైపోయిందని, అలాంటి పరిస్థితుల్లో భారత్ ఇలాంటి పిచ్‌లను సిద్ధం చేసి తమకే నష్టం చేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తీవ్ర టర్నింగ్ పిచ్‌లపై గత సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుల్లో కూడా భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారని హీలీ గుర్తు చేశారు. ఫ్లాట్ పిచ్‌లు సిద్ధం చేస్తే భారత్ తరచూ ఎదుర్కొంటున్న ఓటములను నివారించగలదని ఆమె సూచించారు. “జడేజా, కుల్దీప్, వాషింగ్టన్, అక్షర్ వీరంతా స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేస్తేనే ప్రమాదకరంగా ఉంటారని ఆమె చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

