Anand-Gukesh: విశ్వనాథన్ ఆనంద్‌ 36 ఏళ్ల రికార్డును దాటేశాడు

Anand-Gukesh: విశ్వనాథన్ ఆనంద్‌ 36 ఏళ్ల రికార్డును దాటేశాడు
X
గుకేశ్ ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్నాడు, 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్‌ను 10వ స్థానానికి నెట్టివేశాడు.

చెస్ ప్రపంచంలో భారత్ ఆధిపత్యం ఏంటో ప్రపంచానికి ఎప్పుడో తెలిసొచ్చింది. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి వంటి మేటి ఆటగాళ్లను అందించింది. వారిని తలదన్నేలా 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తన ఆరాధ్య దైవం విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించాడు.

ప్రపంచకప్‌లో రెండో రౌండ్ మ్యాచ్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన మిస్రత్దిన్ ఇస్కందరోవ్‌పై గుకేశ్ విజయం సాధించడంతో ఈ ఘనత సాధించింది. గుకేశ్ కేవలం 44 ఎత్తుల్లో ఇస్కందరోవ్‌ను ఓడించి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

లైవ్ రేటింగ్‌లో తాజాగా 2.5 రేటింగ్ పాయింట్లు పెరగడంతో 2755.9కి పెరిగింది. విశ్వనాథన్ ఆనంద్ రేటింగ్ 2754ని అధిగమించాడు. గుకేశ్ ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్నాడు, 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్‌ను 10వ స్థానానికి నెట్టివేశాడు.

ఆనంద్ 1991లో మొదటిసారి టాప్-10 లో ప్రవేశించాడు. భారత తరపున 1987 జనవరి నుంచి అతడే కొనసాగుతున్నాడు. సెప్టెంబర్ 1 వరకు ఈ రేటింగ్‌ని కొనసాగిస్తే 1986 జులై తర్వాత ఆనంద్‌ని దాటిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించనున్నాడు.

"గుకేష్ డి ఈరోజు మళ్లీ గెలిచాడు. లైవ్ రేటింగ్‌లో విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించాడు. సెప్టెంబరు 1న తదుపరి అధికారిక FIDE రేటింగ్ జాబితాకు ఇంకా దాదాపు ఒక నెల సమయం ఉంది, అయితే 17 ఏళ్ల యువకుడు టాప్-10లో స్థానం సంపాదించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ ఆటగాడు అవుతాడు." అని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) ట్వీట్ చేసింది.

Tags

Next Story