ARJUNA: తెలుగు క్రీడాకారులకు "అర్జున"

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్‌లో జ్యోతి యర్రాజీ, పారా అథ్లెటిక్స్‌లో జీవాంజీ దీప్తి అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. దీప్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా, జ్యోతి ఏపీలోని విశాఖపట్నం నివాసి.
అలుపెరుగని దీప్తికి అర్జున
పారిస్ పారాలింపిక్స్ లో సత్తా చాటిన తెలంగాణ ముద్దు బిడ్డ దీప్తి జీవాంజికి అర్జున పురస్కారం దక్కింది. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి తెలంగాణకు చెందిన జివాంజి దీప్తిలు అర్జున అవార్డుకు ఎన్నికయ్యారు. జివాంజి దీప్తి పారాలంపిక్స్‌లో మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరికి కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అర్జున అవార్డులు
జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)
అన్నూ రాణి (అథ్లెటిక్స్)
నీతూ (బాక్సింగ్)
సవీటి బోరా (బాక్సింగ్)
వంతిక అగర్వాల్ (చెస్)
సలీమా టెటే (హాకీ)
అభిషేక్ (హాకీ)
సంజయ్ (హాకీ)
జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
సుఖ్‌జీత్ సింగ్ (హాకీ)
స్వప్నిల్ సురేష్ కుశాలే (షూటింగ్)
సరభ్‌జోత్ సింగ్ (షూటింగ్)
అభయ్ సింగ్ (స్క్వాష్)
సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
అమన్ (రెజ్లింగ్)
రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్)
ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
దీప్తి జీవాంజి (పారా అథ్లెటిక్స్)
అజీత్ సింగ్ (పారా అథ్లెటిక్స్)
సచిన్ సర్జేరావు ఖిలారా (పారా అథ్లెటిక్స్)
ధరమ్‌బిర్ (పారా అథ్లెటిక్స్)
ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)
హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)
సిమ్రన్ (పారా అథ్లెటిక్స్)
నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్)
నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్)
నిత్యశ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్)
మనీషా రాందాస్ (పారా బ్యాడ్మింటన్)
కపిల్ పర్మార్ (పారా జూడో)
మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
రూబినా ఫ్రాన్సిస్ (పారా బ్యాడ్మింటన్)
అర్జున అవార్డులు (లైఫ్‌టైమ్)
సుచా సింగ్ (అథ్లెటిక్స్)
మురళీకాంత్ రాజారామ్ పెట్కర్ (పారా స్విమ్మింగ్)
ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు)
సుభాష్ రాణా (పారా షూటింగ్)
దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్)
సందీప్ సంగ్వాన్ (హాకీ)
ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ క్రీడాకారులు అత్యున్నత స్థాయిలో మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com