TEST MATCH: అన్ని ప్రశ్నలకు ఈ గెలుపే సమాధానం

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యచ్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక రికార్డులను నమోదు చేసింది. జట్టుగా టీమిండియా, పలువురు ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై పెద్ద పెట్టున విమర్శలు వచ్చాయి. సుదీర్ఘ ఫార్మాట్‌కు గంభీర్ కోచ్‌గా పనికిరాడని.. అతడి కోచింగ్‌లో టెస్టుల్లో అపజయాలే తప్ప సాధించిందేమీ లేదనే కామెంట్స్ వినిపించాయి. యువ సారథి శుబ్‌మన్ గిల్ టీమ్‌ను సమర్థంగా నడిపించలేడని.. అతడి స్థానంలో మరో సీనియర్ ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్స్ వచ్చాయి. అయితే వీటన్నింటికీ ఒకే ఒక్క మ్యాచ్‌తో సాలిడ్ ఆన్సర్స్ దొరికాయి. ఒక్క విజయంతో విమర్శించిన నోళ్లు అన్నీ మూసుకుపోయాయి.
తప్పులు సరిదిద్దుకుని...
తొలి టెస్టులో చేసిన పొరపాట్లను సరిచేసుకొని భారత జట్టు సరికొత్త అధ్యాయం లిఖించింది. సహజంగా కెప్టెన్సీ వచ్చాక ఎంతటి క్రికెటర్‌కైనా కొత్తలో కాస్త ఒత్తిడి ఉంటుంది. అదేంటో శుభ్‌మన్ గిల్లో అదేమీ కనిపించలేదు. కేవలం పాతికేళ్ల వయసులోనే ఎక్కువ అనుభవం కలిగిన ఆటగాడిగా పరిణతి చెందాడు. గత ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ గణాంకాలు గొప్పగా లేవు. ఈసారి మాత్రం తొలి టెస్టులోనే సెంచరీ బాదాడు. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచినా (371) ఆ మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. తాను అనవసరమైన షాట్ కొట్టి ఔట్ కాకుండా ఉంటే.. ఇంగ్లాండ్ ముందు ఇంకా ఎక్కువ లక్ష్యం ఉంచేవాళ్లమన్నాడు. ఈ ఓటమికి తన తప్పిదమే ప్రధాన కారణమనేలా స్పందించాడు. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ ఔటైన తర్వాత టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. రెండో టెస్టులో మాత్రం తన మాటలను గుర్తుపెట్టుకొని చుక్కలు చూపించాడు.
బుమ్రా లేకున్నా ఆకట్టుకున్నారు
జస్ప్రీత్ బుమ్రా లేడు. అప్పటికే 0-1తో వెనకబడి ఉన్నాం. బుమ్రా స్థానంలో లెఫ్ట్ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్‌ను తీసుకోండని బయట నుంచి సలహాలు. అవన్నీ కాదని ఆకాశ్ దీప్‌కు అవకాశం ఇచ్చింది మేనేజ్మెంట్. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీయగా.. ఆకాశ్ నాలుగు పడగొట్టి సత్తా చాటాడు. డేంజరస్ బ్యాటర్లు బెన్ డకెట్, ఓలీ పోప్‌ను డకౌట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు. సాధారణంగా వీరిద్దరూ క్రీజ్‌లో పాతుకుపోతే ఔట్ చేయడం చాలా కష్టం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ విశ్వరూపమే చూపించాడు. తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అతడు.. అత్యంత దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ఆడే జో రూట్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. ఈ టెస్టులో మొత్తం 10 వికెట్లు తీసి ‘లార్డ్స్’కు సిద్ధమేనని చెప్పకనే చెప్పాడు. కొత్త బంతితోనే కాకుండా పాతబడిన తర్వాత కూడా వికెట్లు తీయడం తన స్పెషాలిటీ. ఇన్‌స్వింగ్‌తో స్టంప్ టు స్టంప్ బౌలింగ్ ఎటాక్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. సిరాజ్ - ఆకాశ్ కలిసి మొత్తం 17 వికెట్లు పడగొట్టారు. తొలి టెస్టులో ఓటమి అనంతరం తాము చేసిన పొరపాట్లేంటో టీమ్ఇండియా త్వరగానే తెలుసుకుంది. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంటేనే ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను కట్టడి చేయొచ్చని ప్రాథమిక సూత్రాన్ని ఈ మ్యాచ్‌లో పాటించింది. లోయర్ ఆర్డర్ నుంచి మంచి భాగస్వామ్యాలు రావడం కూడా కలిసొచ్చింది. ప్రతి ఆటగాడూ గెలవాలనే పట్టుదల ప్రదర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com