థాయ్‌లాండ్ ఓపెన్‌ : పీవీ సింధు ఔట్!

థాయ్‌లాండ్ ఓపెన్‌ : పీవీ సింధు ఔట్!
థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు ఓడిపోయింది.

థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. క్వార్టర్‌ఫైనల్లో పేలవ ప్రదర్శనతో సింధు ఘోరంగా నిరాశపరిచింది. ముప్పై ఎనిమిది నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పివి సింధు థాయ్ ప్రత్యర్థి షట్లర్ రచనోక్ ఇంటానన్ చేతిలో 13-21, 9-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం పాలైంది. వరుసగా రెండు గేమ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన రచనోక్‌.. సింధును మట్టికరిపించింది. అటు పురుషుల సింగిల్స్ క్వార్టర్ మ్యాచ్‌లో భారత ఆటగాడు సమీర్ వర్మ కూడా ఇంటిదారి పట్టాడు. ఆంటోన్సెన్(డెన్మార్క్) చేతిలో 13-21, 21-19, 20-21తో పోరాడి ఓడాడు.

Tags

Read MoreRead Less
Next Story