The Ashes: 132 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా

The Ashes: 132 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా
X
40 పరుగుల వెనుకంజలో కంగారులు

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కంగారూల జట్టు ఇప్పటికీ 40 పరుగుల వెనుకంజలో ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

పె­ర్త్‌ వే­ది­క­గా మొ­ద­లైన తొలి మ్యా­చ్‌­లో ఏకం­గా 19 వి­కె­ట్లు పడ్డా­యి. యా­షె­స్‌ సి­రీ­స్‌ చరి­త్ర­లో గడి­చిన వం­దే­ళ్ల­లో ఇలా ఎప్పు­డూ జర­గ­లే­దు. 2001 ట్రెం­ట్‌­బ్రి­డ్జ్‌ టె­స్ట్‌­లో అత్య­ధి­కం­గా 17 వి­కె­ట్లు పడ్డా­యి. యా­షె­స్‌ టె­స్ట్‌ తొలి రోజు 18 అం­త­కం­టే ఎక్కువ వి­కె­ట్లు పడిన ఏకైక ఉదం­తం 1909 ఓల్డ్‌ ట్రా­ఫ­ర్డ్‌ టె­స్ట్‌­లో చోటు చే­సు­కుం­ది. ఆ మ్యా­చ్‌ తొలి రోజు రి­కా­ర్డు స్థా­యి­లో 20 వి­కె­ట్లు పడ్డా­యి. తొ­లుత ఆస్ట్రే­లి­యా 147, ఆర్వాత ఇం­గ్లం­డ్‌ 119 పరు­గు­ల­కు ఆలౌ­ట­య్యా­యి.

యా­షె­స్‌ టె­స్ట్‌­లో­నూ పు­న­రా­వృ­త­మైం­ది. తొ­లుత బ్యా­టిం­గ్‌ చే­సిన ఇం­గ్లం­డ్‌ 172 పరు­గు­ల­కు ఆలౌ­ట్‌ కాగా.. తొలి రోజు ఆట ము­గి­సే సమ­యా­ని­కి ఆస్ట్రే­లి­యా 9 వి­కె­ట్ల నష్టా­ని­కి 123 పరు­గు­లు చే­సిం­ది. టా­స్‌ గె­లి­చి తొ­లుత బ్యా­టిం­గ్‌ చే­సిన ఇం­గ్లం­డ్‌­పై మి­చె­ల్‌ స్టా­ర్క్‌ ని­ప్పు­లు చె­రి­గా­డు. ఏకం­గా 7 వి­కె­ట్లు తీసి ఇం­గ్లం­డ్‌ ఇన్నిం­గ్స్‌­ను మట్టు­బె­ట్టా­డు. అరం­గే­ట్రం పే­స­ర్‌ బ్రెం­డ­న్‌ డా­గ్గె­ట్‌ 2, గ్రీ­న్‌ ఓ వి­కె­ట్‌ తీ­శా­రు. ఇం­గ్లం­డ్‌ ఇన్నిం­గ్స్‌­లో హ్యా­రీ బ్రూ­క్‌ (52) టా­ప్‌ స్కో­ర­ర్‌­గా ని­లు­వ­గా.. ఓలీ పో­ప్‌ (46), జేమీ స్మి­త్‌ (33), డకె­ట్‌ (21) ఓ మో­స్త­రు స్కో­ర్లు చే­శా­రు. జా­క్‌ క్రా­లే, రూ­ట్‌, మా­ర్క్‌ వు­డ్‌ డకౌ­ట్లు కాగా.. స్టో­క్స్‌ 6, అట్కి­న్స­న్‌ 1, కా­ర్స్‌ 6 పరు­గు­ల­కు ఔట­య్యా­రు. అనం­త­రం బరి­లో­కి ది­గిన ఆస్ట్రే­లి­యా­పై ఇం­గ్లం­డ్‌ బౌ­ల­ర్లు సైతం వి­రు­చు­కు­ప­డ్డా­రు. కె­ప్టె­న్‌ స్టో­క్స్‌ 5, ఆర్చ­ర్‌, కా­ర్స్‌ తలో 2 వి­కె­ట్లు తీసి ఆసీ­స్‌ ఇన్నిం­గ్స్‌­ను పతనం అం­చు­కు తీ­సు­కె­ళ్లా­రు. ఆస్ట్రే­లి­యా జట్టు తొలి రోజు ఆట ము­గి­సే సమ­యా­ని­కి 39 ఓవ­ర్ల­కు 9 వి­కె­ట్లు నష్ట­పో­యి 123 పరు­గు­లు చే­సిం­ది.

నిప్పులు చెరిగిన స్టార్క్‌

మొ­ట్ట­మొ­ద­టి టె­స్ట్‌­లో ఆసీ­స్ స్టా­ర్ బౌ­ల­ర్ మి­చె­ల్ స్టా­ర్క్ అసా­ధా­ర­ణ­మైన బౌ­లిం­గ్‌­తో చె­ల­రే­గి­పో­యా­డు. తన టె­స్ట్ కె­రీ­ర్‌­లో­నే బె­స్ట్ స్పె­ల్‌­ను వే­సిన స్టా­ర్క్ ఇం­గ్లం­డ్‌ బ్యా­ట­ర్ల­ను కా­ర్డుల పే­క­మే­డ­లా కూ­ల్చే­శా­డు. స్టా­ర్క్ బౌ­లిం­గ్‌­లో పరు­గు­లు చే­య­డం అటుం­చి­తే, కనీ­సం ని­ల­బ­డ­టా­ని­కి కూడా ఇబ్బం­ది పడ్డా­రు. స్టా­ర్క్ సృ­ష్టిం­చిన 'ని­ప్పు­లు చె­రి­గే' బం­తుల ధా­టి­కి ఇం­గ్లం­డ్‌ జట్టు రెం­డో సె­ష­న్‌­లో­నే 172 పరు­గు­ల­కే కు­ప్ప­కూ­లిం­ది. ఇం­గ్లం­డ్ కె­ప్టె­న్ బెన్ స్టో­క్స్ టాస్ గె­లి­చి ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­డు. కానీ ఆస్ట్రే­లి­యా­కు చెం­దిన వి­ధ్వం­స­కర ఫా­స్ట్ బౌ­ల­ర్ మి­చె­ల్ స్టా­ర్క్ ఆ ని­ర్ణ­యా­న్ని పీ­డ­క­ల­గా మా­ర్చా­డు. మ్యా­చ్ మొ­ద­టి రోజు నుం­చే స్టా­ర్క్ దాడి మొ­ద­లైం­ది. తొలి ఓవ­ర్‌­లో­నే వి­కె­ట్ తీసి ఆస్ట్రే­లి­యా­కు అద్భు­త­మైన ఆరం­భా­న్ని అం­దిం­చిన స్టా­ర్క్, ఆ తర్వాత ఆగ­లే­దు. లంచ్ సమ­యా­ని­కి మూడు వి­కె­ట్లు పడ­గొ­ట్టి ఇం­గ్లం­డ్ టాప్ ఆర్డ­ర్‌­ను నా­శ­నం చే­సిన స్టా­ర్క్ రెం­డో సె­ష­న్‌­లో మరింత ఉగ్రం­గా కని­పిం­చా­డు. ఈ సె­ష­న్‌­లో అతను కే­వ­లం ఐదు వి­కె­ట్లే కాక.. మొ­త్తం­గా 7 వి­కె­ట్లు పడ­గొ­ట్టి ఇం­గ్లం­డ్‌­ను ఆలౌ­ట్ చే­శా­డు. 7 వి­కె­ట్లు తీ­య­డం మి­చె­ల్ స్టా­ర్క్ టె­స్ట్ కె­రీ­ర్‌­లో­నే అత్యు­త్తమ బౌ­లిం­గ్ ప్ర­ద­ర్శన కా­వ­డం గమ­నా­ర్హం.స్టా­ర్క్ తన బౌ­లిం­గ్‌­తో పె­ర్త్‌­లో అక్ష­రా­లా 'ని­ప్పుల గో­ళా­లు' వి­సి­రి­న­ట్లు­గా కని­పిం­చా­డు.

Tags

Next Story