CHESS: చెస్‌ పవర్‌హౌస్‌గా చైనా

CHESS: చెస్‌ పవర్‌హౌస్‌గా చైనా
చెస్‌ ప్రపంచంలో చైనా ఆధిపత్యం... పురుష, మహిళల ప్రపంచ ఛాంపియన్లుగా చైనీయులు.. పక్కా ప్రణాళికతో చెస్‌ పవర్‌గా డ్రాగన్‌..

అగ్రరాజ్యంగా అవతరించాలని తహతహలాడుతున్న చైనా అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై క్రీడల్లోనూ తన ప్రాబల్యాన్ని బలంగా చాటుతోంది. కానీ కొన్నేళ క్రితం వరకు చైనాలో చెస్‌ అంతరించేపోయే స్థితిలో ఉంది. కానీ ఇప్పుడు పక్కా ప్రణాళికతో డ్రాగన్‌ చెస్‌ పవర్‌ హౌస్‌గా మారిపోయింది. చదరంగ ప్రపంచంలో ఆధిపత్య శక్తిగా ఉద్భవించింది. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లుగా పురుషుల్లోనూ... మహిళల్లోనూ చైనీయులే ఉండడం చెస్‌ ప్రపంచంలో డ్రాగన్‌ ఆధిపత్యాన్ని చాటిచెబుతోంది. 2023 జూన్‌లో వెల్లడైన ఫిడే రేటింగ్‌లో ప్రపంచంలోని టాప్ 20 మంది చెస్ ప్లేయర్‌లలో చైనాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. మహిళల విభాగంలో అయితే అయిదుగురు చైనీయులకు స్థానం దక్కింది. ఇందులో ముగ్గురు మహిళులు తొలి అయిదు స్థానాల్లో నిలవడం ప్రపంచ చెస్‌లో డ్రాగన్‌ ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తూ చాటి చెబుతోంది. భారత్‌, ఉక్రెయిన్, జర్మనీ కంటే చైనాలో తక్కువమంది గ్రాండ్‌మాస్టర్‌లు ఉన్నారు. అయినా టాప్ టెన్ ఆటగాళ్ల రేటింగ్‌ జాబితాలో డ్రాగన్‌ మూడో స్థానంలో నిలిచింది.


20వ శతాబ్దపు ప్రారంభం వరకు చైనాలో చెస్‌ ఆడడమే ప్రారంభం కాలేదు. మొదట్లో అక్కడ చదరంగానికి పెద్దగా ఆదరణ లభించలేదు. సాంస్కృతిక విప్లవం సమయంలో చెస్‌ను క్షీణ దశకు చేరుకున్న కార్యకలాపాల జాబితాలో కూడా చేర్చారు. కానీ 1962 నుంచి చెస్‌ ఆడడాన్ని చైనీయులు ప్రారంభించారు. 1975లో FIDEలో చేరిన చైనా చెస్ అసోసియేషన్.... 1976 నుంచి అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించారు. డ్రాగన్‌లో చదరంగం అభివృద్ధిలో మలేషియా చెస్‌ దిగ్గజం డాటో తాన్ చిన్ నామ్ కీలకపాత్ర పోషించాడు. చైనా అంతటా చదరంగం జ్వాలలను వ్యాపింపజేసి... చెకర్‌బోర్డ్‌లో ప్రధాన ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దాడు.


1977 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రెండవ స్థానాన్ని గెలుచుకున్న చైనా.. 1979, 1981లో ఆసియా టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచింది. 1984 చెస్‌ ఒలింపియాడ్‌లో 8వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకుంది. 2010, 2012, 2014లో ఒలింపియాడ్‌లో మహిళల జట్టు రజత పతకాలను గెలుచుకుంది. హౌ యిఫాన్ అతి పిన్న వయస్కురాలైన మహిళల ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పురుషుల జట్టు 2014, 2018లో ఒలింపియాడ్‌లో స్వర్ణాలు గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్, యు యాంగి, వాంగ్ హావో వీ యి సహా చైనాలో ఇప్పుడు 20 నుంచి 30 మంది గ్రాండ్‌ మాస్టర్‌లు ఉన్నారు. ప్రపంచ విజేత అయిన తొలి చైనా ఆటగాడిగా డింగ్‌ లిరెన్‌ చరిత్ర సృష్చించాడు. ఇప్పుడు మహిళల ప్రపంచ ఛాంపియన్ కూడా చైనా ఖాతాలోనే ఉంది. డింగ్ లిరెన్ విజయం చైనాలో పెను మార్పును తీసుకొచ్చింది. ఇప్పుడు అక్కడ చదరంగం ఆడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రానున్న మరి కొన్నేళ్లలో ప్రపంచ చదరంగంలో చైనా ఆదిపత్యం కొనసాగనుందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story