TILAK: శుభ్‌మన్ గిల్ కోసం తెలుగోడికి అన్యాయం

ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సత్తా చాటిన టీమిండియా టెస్ట్ సారథి శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ ప్రమోషన్ ఇవ్వాలనుకుంటుంది. టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆసియా కప్ 2025కు ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉంది. కొందరు మాజీ క్రికెటర్లు సైతం శుభ్‌మన్ గిల్‌ను మూడు ఫార్మాట్లకు సారథిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు లేదు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని కుర్రాళ్లతో కూడిన జట్టు అసాధారణ ప్రదర్శన కనబర్చింది. వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంది.
క్రమ క్రమంగా కెప్టెన్సీ కూడా గిల్ కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. వన్డేలకు కూడా గిల్ కెప్టెన్ అవుతాడు అన్నమాట. అంటే ఓవరాల్ గా మూడు ఫార్మాట్లకు కూడా గిల్ ను కెప్టెన్ చేసే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా జట్టులోకి గిల్ వస్తే... తిలక్ వర్మ తప్పుకోవాల్సి వస్తుందని అంటున్నారు. తెలుగు కుర్రాడైన తిలక్ వర్మ... మూడవ స్థానంలో అద్భుతంగా రాణిస్తాడు. కానీ గిల్ రంగంలోకి దిగితే తిలక్ వర్మను సెలెక్ట్ చేయకపోవచ్చని ప్రాథమిక సమాచారం అందుతోంది. దీంతో తెలుగు అభిమానులు....బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైస్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ కి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక క్రమక్రమంగా కెప్టెన్సీ ని కూడా శుబ్ మన్ గిల్ కే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే వన్డేలకు కూడా గిల్ కెప్టెన్ కచ్చితంగా అవుతాడని స్పష్టంగా అర్థమవుతోంది. శుభ్‌మన్ గిల్ కోసం తిలక్ వర్మను తప్పించడం భావ్యం కాదని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం.
తిలక్‌ను బలిపశువును చేస్తారా..?
శుభ్‌మన్ గిల్ కోసం తిలక్ వర్మను తప్పించడం భావ్యం కాదని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. వాస్తవానికి గతేడాదిగా టీ20 ఫార్మాట్‌కు శుభ్‌మన్ గిల్ దూరంగా ఉన్నాడు. అతను చివరి టీ20 మ్యాచ్‌ను శ్రీలంకతో గతేడాది జూలైలో ఆడాడు. మరోవైపు తిలక్ వర్మ నెంబర్-3 బ్యాటర్‌గా సెంచరల మోత మోగించాడు. మిడిలార్డర్లో కీలకంగా మారాడు. అంతేకాకుండా శుభ్‌మన్ గిల్ ఉన్నప్పుడు కూడా తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కింది. ఇప్పటి వరకు 25 అంతర్జాతీయ టీ20లు ఆడిన తిలక్ వర్మ 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అతను నెంబర్ 2 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
దుమ్మురేపిన తెలుగోడు
టీమిండియా ఆడిన చివరి రెండు టీ20 సిరీస్‌లోనూ తిలక్ వర్మ దుమ్మురేపాడు. ముఖ్యంగా సఫారీ గడ్డపై వరుసగా(107*, 120*) రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో కాస్త తడబడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 16 మ్యాచ్‌ల్లో 31.18 సగటుతో 343 పరుగులే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే తిలక్ వర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌ను తీసుకోవాలనే వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మూడో స్థానంలో అద్భుతంగా రాణిస్తాడు. గిల్ రంగంలోకి దిగితే తిలక్ వర్మను సెలక్ట్ చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే గిల్ కారణంగా అద్భుత క్రికెటర్ తిలక్ వర్మకి అన్యాయం జరుగుతుందనే చెప్పవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com