Dawald Brevis: తిలక్‌కి ప్రత్యేక సందేశం పంపిన బేబీ డివిలియర్స్

భారత ఆటగాళ్లను భారత క్రికెట్ జట్టుకు పరిచయం చేయడంలో ఐపీఎల్‌లో ఎంతో సహాయపడుతుంది. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లంతా ఆ కోవకు చెందినవారే. ఇటీవలె యశస్వి జైశ్వాస్, ముఖేష్ కుమార్‌లు విండీస్‌తో సిరీస్‌లో ఆరంగేట్రం చేశారు. నిన్న జరిగిన మొదటి టీ20లో తెలుగు కుర్రాడు, ముంబై ఆటగాడు తిలక్ వర్మ భారత జట్టు తరపున తన మొదటి మ్యాచ్ ఆడాడు. వచ్చీ రాగానే ఓ సిక్స్‌తో తన ఆరంగేట్రాన్ని ఘనంగా ఆరంభించాడు. తర్వాత బంతికే మరో సిక్సూ కొట్టి ఐపీఎల్‌లో చేసిన ప్రదర్శన చేతివాటం కాదని చాటి చెప్పాడు. నిన్నటి మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 39 పరుగులు చేసి, భారత్‌ను గెలుపు దిశలో నిలిపాడు. అయినప్పటీకీ భారత్ మ్యాచ్ ఓడింది.
తిలక్ వర్మ మొదటి మ్యాచ్‌లో రాణించడంతో తన ముంబై జట్టు సహచరుడు, బేబీ ఏబీ బ్రూవిస్ వర్మకు ప్రత్యేక సందేశం పంపాడు. తన ఆటని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నాడు.ఈ వీడియోని బీసీసీఐ ఎక్స్-X(ట్విట్టర్)లో షేర్ చేసింది.
A special cross-continental friendship! 🇮🇳 🇿🇦
— BCCI (@BCCI) August 3, 2023
Tilak Varma 🤝 Dewald Brevis #TeamIndia | #WIvIND | @TilakV9 | @BrevisDewald pic.twitter.com/SLomVNjpCi
"మొదటి మ్యాచ్ ఆడుతున్న నువ్వు ఉత్తేజభరితంగా ఉంటావనుకుంటున్నాను. నా తరపున, నా బ్రూవిస్ కుటుంబం తరపున నీకు శుభాకాంక్షలు. నీకు, నీ కుటుంబానికి ఇవి మరవలేని క్షణాలు. వారు ఈ క్షణాల్ని ఆస్వాదిస్తున్నారనుకుంటున్నాను. నీ జీవితాయాన్ని సాధించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నువ్ ఆడిన 2,3 బంతులను భారీ సిక్సర్లను కొట్టడం చూస్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నీకు నా మద్దతు ఎల్లపుడూ ఉంటుంది." అని అన్నాడు.
బ్రూవిస్ సందేశంతో ఆశ్చర్యపోయిన తిలక్ బ్రూవిస్ నుంచి ఇటువంటి సందేశాన్ని ఊహించలేదన్నాడు. "నాకు చాలా నచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. మా కోచ్ నుంచి, నా కుటుంబం ఇటువంటి సందేశం ఇస్తుందనుకున్నాను. కానీ సహోదరుడు లాంటి బ్రూవిస్ నుంచి ఊహించలేదు. నీకు కృతజ్ణతలు. త్వరలోనే కలుసుకుందాం. ధన్యవాదాలు" అని రిప్లై ఇచ్చాడు.
గత ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. కీలక సమయాల్లో సత్తా చాటుతూ ముంబాయి జట్టకు కీలక ప్లేయర్‌గా ఎదిగాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com