TILAK VARMA: ఈ విజయం భారత జవాన్లకు అంకితం

TILAK VARMA: ఈ విజయం భారత జవాన్లకు అంకితం
X
హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి.. లెగాల క్రికెట్ అకాడమీ సందర్శన.. చాలా ఒత్తిడిలో బ్యాటింగ్ చేశానన్న తిలక్.. పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వించారని వెల్లడి

ఆసి­యా కప్ ఫై­న­ల్ మ్యా­చ్ వి­జ­యా­న్ని భారత జవా­న్ల­కు అం­కి­తం ఇచ్చి­న­ట్లు టీ­మిం­డి­యా స్టా­ర్ బ్యా­ట­ర్ తి­ల­క్ వర్మ వె­ల్ల­డిం­చా­డు. మం­గ­ళ­వా­రం హై­ద­రా­బా­ద్‌­లో­ని లిం­గం­ప­ల్లి­లో తాను శి­క్షణ పొం­దిన లె­గాల క్రి­కె­ట్ అకా­డ­మీ­లో తి­ల­క్ వర్మ సం­ద­డి చే­శా­రు. లె­గాల క్రి­కె­ట్ అకా­డ­మీ­లో శి­క్షణ పొం­దు­తు­న్న ఆట­గా­ళ్ల­తో ము­చ్చ­టిం­చా­రు. ‘‘ప్ర­తి మ్యా­చ్‌­లో మా వ్యూ­హా­లు మా­ర్చు­కుం­టూ గె­లు­పు కోసం కృషి చే­శాం. అం­ద­రం సమ­ష్టి­గా కష్ట­ప­డ్డాం. చాలా ఒత్తి­డి­లో­నే నేను బ్యా­టిం­గ్‌ చే­శా­ను. దే­శా­న్ని గె­లి­పిం­చా­ల­న్న లక్ష్యం­తో­నే ఆడా­ను’’ అని వి­వ­రిం­చా­రు. మై­దా­నం­లో పా­కి­స్తా­న్ ప్లే­య­ర్లు అనే­క­సా­ర్లు రె­చ్చ­గొ­ట్టే ప్ర­య­త్నం చే­శా­రని తమకు చాలా కోపం వచ్చిం­దని తి­ల­క్ వర్మ వె­ల్ల­డిం­చా­డు. కానీ కళ్ల ముం­దు దే­శ­మే కని­పిం­చిం­దని అం­దు­కే చాలా ఓపి­గ్గా ఆడా­మ­ని తె­లి­పా­డు. అప్ప­టి­కే మూడు కీ­ల­క­మైన వి­కె­ట్లు కూడా పడ్డా­యని.... దాం­తో నా మీద మరింత బా­ధ్యత పె­రి­గిం­ది అని­పిం­చిం­దని తె­లి­పా­డు. ఆ బా­ధ్య­త­ను గు­ర్తె­రి­గి బ్యా­టిం­గ్ చే­శా­న­ని.. వి­జ­యం సా­ధిం­చా­ల­న్న కసి­తో ముం­దు­కు సా­గా­న­ని వె­ల్ల­డిం­చా­డు.

కసిగా ఆడాం

ఆసి­యా కప్ ఫై­న­ల్లో చాలా కసి­గా ఆడా­మ­ని.. కసి­గా ఆడి జట్టు­కు వి­జ­యా­న్ని అం­దిం­చామని తి­ల­క్ వర్మ తె­లి­పా­డు. అం­ద­రం సమి­ష్టి­గా రా­ణిం­చా­మ­ని తి­ల­క్ వర్మ అన్నా­డు. ఈ మ్యా­చ్ వి­జ­యం ఎంతో సం­తో­షా­న్ని ఇచ్చిం­ద­ని చె­ప్పా­డు. వి­జ­యం­లో తల్లి­దం­డ్రు­లు, కో­చ్‌­దే కీలక పా­త్ర అని అన్నా­రు. ఆప­రే­ష­న్ సిం­దూ­ర్ తర్వాత పా­కి­స్తా­న్ ప్లే­య­ర్ల­లో చాలా మా­ర్పు వచ్చిం­ద­ని తె­లి­పా­రు.

తిలక్‌ వర్మకు ఘన స్వాగతం

ఆసి­యా­క­ప్‌ ఫై­న­ల్లో పా­కి­స్థా­న్‌­పై భా­ర­త్‌ వి­జ­యం­లో కీలక పా­త్ర పో­షిం­చిన యువ బ్యా­ట­ర్‌ తి­ల­క్‌ వర్మ­కు.. శం­షా­బా­ద్‌ వి­మా­నా­శ్ర­యం­లో అభి­మా­ను­లు ఘన­స్వా­గ­తం పలి­కా­రు. తె­లం­గాణ స్పో­ర్ట్స్‌ అథా­రి­టీ ఛై­ర్మ­న్‌ ఇం­ద్ర­సే­నా­రె­డ్డి, ఎండీ సోనీ బా­లా­దే­వి తి­ల­క్‌­ను కలి­సి అభి­నం­ద­న­లు తె­లి­పా­రు. “ఆప­రే­ష­న్ తి­ల­క్ వర్మ”.. అని దే­శ­మం­తా అం­టుం­డ­టం చాలా గర్వం­గా ఉం­ద­ని ఈ టీ­మిం­డి­యా స్టా­ర్ తె­లి­పా­డు. ఆసి­యా కప్ ఫై­న­ల్‌­లో­ని ఇన్నిం­గ్స్ ఎప్ప­టి­కీ గు­ర్తుం­డి­పో­తుం­ద­ని, జట్టు కోసం కష్ట­ప­డ్డం­దు­కు సం­తో­షం­గా ఉన్న­ట్లు తె­లి­పా­రు. ఈ సం­తో­షా­న్ని ఎలా పం­చు­కో­వా­లో కూడా తె­లి­య­డం లే­ద­ని తె­లి­పా­రు. టో­ర్నీ­లో జట్టు సమ­ష్టి­గా కష్ట­ప­డ్డిం­ద­ని, చి­వ­రి ని­మి­షం వరకు ఉత్కంఠ కొ­న­సా­గిం­ద­ని కూడా పే­ర్కొ­న్నా­రు. ఓటమి తీ­రా­లు­గా వె­ళ్తు­న్న మ్యా­చ్‌­లో తానే గె­లు­పు బా­ట­లు వే­శా­న­ని తె­లి­పా­రు. వ్యూ­హాల మా­ర్పు­లు, ప్ర­తి మ్యా­చ్‌­లో జట్టు కృషి వి­జ­యా­ని­కి కా­ర­ణ­మ­ని తిలక్ పేర్కొన్నాడు. ఫై­న­ల్లో తి­ల­క్ 53 బం­తు­ల్లో 3 ఫో­ర్లు, 4 సి­క్సు­ల­తో 69 పరు­గు­లు చేసి నా­టౌ­ట్‌­గా ని­లి­చా­రు.

Tags

Next Story