Tokyo olympics 2021: గురువారం అన్ని గుడ్ న్యూస్లే..!

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. పతకాలు సాధించే దిశగా ప్రయాణిస్తున్నారు. మెన్స్ హాకీ జట్టు విజయం నమోదు చేసుకోగా.. మరోవైపు ఆర్చర్ అతాను దాస్ ప్రీక్వార్టర్స్ లోని ప్రవేశించాడు. బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ కి చేరింది. బాక్సర్ సతీశ్ కుమార్ బాక్సింగ్ లో రాణించాడు.
భారత హాకీ జట్టు
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పూల్ ఏలో అర్జెంటీనాతో తలపడ్డ మ్యాచులో భారత జట్టు 3-1 తేడాతో విజయాన్ని సాధించింది. మూడవ క్వార్టర్ చివరి వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. అయితే మ్యాచ్‌లో 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్ వరుణ్ తొలి గోల్ చేయగా.. అనంతరం అర్జెంటీనా కూడా గోల్ సాధించి స్కోర్ ఈక్వల్ చేసింది. అయితే 58వ నిమిషంలో ప్రసాద్ వివేక్‌సాగర్, 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో 3-1 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది.
అతానుదాస్
టోక్యో ఒలింపిక్స్‌లో మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో అతానుదాస్ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఎలిమినేషన్ రౌండ్‌లో వరల్డ్ మూడో ర్యాంకర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హోతో తలపడిన దాస్.. విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఇక అంతక ముందు చైనీస్ థైపాయ్‌కి చెందిన డెంగ్ యూ చెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనుదాస్ 6-4 తేడాతో సొంతం సొంతం చేసుకున్నారు. ఆఖరి షాట్‌వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దాస్ విజయం అందుకున్నాడు.
జిన్-హయెక్.. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్.. అర్చరీలో 4 సార్లు అతను స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఎలిమినేషన్ రౌండ్‌లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్‌కు చుక్కలు చూపాడు. 6-5 పాయింట్ల తేడాతో ముందడుగు వేశాడు. ఈ ఉదయం పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్‌లో తన ప్రత్యర్థి చైనీస్ తైపే అర్చర్ డెంగ్ యు-ఛెంగ్‌ను 6-4 తేడాతో ఓడించాడు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, హాకీ ఇండియా.. సాధించిన విజయాల పరంపరను భారత అర్చర్ అతాను దాస్ కొనసాగించాడు.
పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిక్ ఫెల్ట్ పై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. తొలి సెట్ ను 21-15 తో గెల్చుకున్న సింధు, తరువాతి సెట్ ను 21- 13తో గెల్చుకొని మ్యాచ్ ను కైవసం చేసుకుంది. మొదటి నుంచి సింధు ఆధిపత్యం ప్రదర్శించినా.. మియా మాత్రం అంత తేలికగా పాయింట్లు ఇవ్వలేదు. అయితే ప్రత్యర్థిని ప్రెజర్ లోకి నెట్టిన సింధు.. చివరికి ఎలాంటి ఇబ్బంది పడకుండానే విజయం సొంతం చేసుకుంది. వరుసగా మూడు విజయాలతో సింధు గ్రూప్ జే లో అగ్రస్థానంలో నిలిచింది.
సతీశ్ కుమార్
బాక్సర్ సతీశ్ కుమార్ 91కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. . 30-27, 30-27, 28-29, 30-27, 30-26 స్కోర్లతో.. జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ ప్రపంచ, ఆసియా ఛాంపియన్ బాఖోదిర్ జలోలొవ్‌తో అతడు తలపడనున్నాడు. అతడిని ఓడించి సెమీస్‌కు చేరితే సతీశ్‌కు కనీసం కాంస్యం ఖాయమవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com