నేడు ఒలింపిక్స్‌లో భారత్ మ్యాచ్‌లు..పతకం సాధించే సత్తా ఉన్న అథ్లెట్లు వీరే..!

Indian Athletes File Photos
Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో భారత్ ఇవాళ పలు కీలక మ్యాచ్‌లు ఆడబోతోంది. కాసేపట్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్ ఉంది... మధ్యాహ్నం ఒంటిగంటకు స్వీడన్‌తో టేబుల్ టెన్నీస్ మ్యాచ్ ఉంటుంది.. సాయంత్రం ఐదున్నరకి మహిళల హాకీ జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది..భారత్ మొత్తం 18 క్రీడాంశాల్లో పోటీ పడుతుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి పీవీ సింధు, సానియా మిర్జా, ప్రణీత్, సాత్విక్ పాల్గొంటున్నారు.
203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నారు. 33 విభాగాల్లో 339 ఈవెంట్లు జరగబోతున్నాయి. కొత్తగా ఈసారి ఐదు విభాగాలను ప్రవేశపెట్టారు. సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటే, బేస్‌బాల్ క్రీడలను ఒలింపిక్స్‌లో భాగంగా మార్చారు. ఇటీవలి కాలంలో రద్దయిన టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, జూడో మిక్స్‌డ్ టీమ్‌ను పునరుద్దరించారు.
స్విమ్మింగ్ పోటీల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు. ఆగస్టు 8 వరకూ ఒలింపిక్స్ జరగనున్నాయి. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ప్రకటించింది. స్వర్ణం గెలిస్తే 75 లక్షలు, రజతానికి 40 లక్షలు, కాంస్యానికి 25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది.
కోవిడ్ దెబ్బతో పలుమార్లు వాయిదాపడిన ఒలింపిక్స్ క్రీడలు నిన్న లాంఛనంగా ప్రారంభయ్యాయి. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా మహోత్సవాన్ని జపాన్ చక్రవర్తి నరహిటో ప్రారంభించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం 1000 అతిథుల సమక్షంలో ఆరంభోత్సవం జరిగింది. భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో తప్పక పతకం సాధిస్తారని భారత ప్లేయర్లపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పీవీ సింధు, నీరజ్ చోప్రా, షూటింగ్ విభాగంలో సౌరభ్ చౌదరి, రెజ్లర్ బజరంగ్ పూనియా, బాక్సర్ మేరీకోమ్, జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com