Tokyo Olympics 2021: మల్లీశ్వరి తర్వాత మెడల్ అందుకున్న మరో మణిపూస

Tokyo Olympics 2021: జపాన్ వేదికగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో విజేతగా నిలిచి మన దేశ కీర్తి ప్రతిష్టలకు వన్నె తెచ్చింది మణిపూర్ మణిపూస మీరాబాయి చాను. వెయింట్ లిప్టింగ్ పోటీల్లో ఆమె తన సత్తా చాటి రజత పతకాన్ని గెలుచుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం జరిగిన 49 కేజీల విభాగంలో మణిపూర్‌కు చెందిన మీరాబాయి చాను రజత పతకం సాధించింది. దాదాపు 20 ఏళ్ల తరువాత ఒలింపిక్స్ నుండి భారతదేశం చేసిన మొదటి వెయిట్ లిఫ్టింగ్ పతకం ఇది (కరణం మల్లేశ్వరి, 2000). చైనాకు చెందిన హౌ జిహుయి మొత్తం 210 కేజీలతో స్వర్ణం సాధించింది. మీరాబాయి 202 కిలోలతో రెండవ స్థానంలో నిలిచింది. ఆమె మొత్తం ఈ విభాగంలో మునుపటి ఒలింపిక్ రికార్డును బద్దలుకొట్టింది.
2016 లో పివి సింధు తర్వాత ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన రెండవ భారతీయ మహిళగా మీరాబాయి నిలిచింది. మీరాబాయికి 87 కిలోల ఉత్తమ స్నాచ్ లిఫ్ట్ మరియు 115 కిలోల క్లీన్ అండ్ జెర్క్ ఉన్నాయి. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది.
Mirabai Chanu
14 ఏళ్ల వయస్సులో మిరాబాయి ఆర్చర్ అవ్వాలని కోరుకుంది. కాని అనుకోకుండా వెయిట్ లిఫ్టింగ్ పట్ల ఆకర్షితురాలైంది. 2007 చివరలో ఇంఫాల్‌లోని ఖుమాన్ లాంపాక్ స్టేడియం లో మణిపూర్ ప్రభుత్వం నడుపుతున్న కేంద్రంలో చేరి సాధన చేసింది. ఆమె నివసిస్తున్న గ్రామం నాంగ్‌పోక్ కాచింగ్ నుండి ఉదయాన్నే శిక్షణ కోసమని 20 కి.మీ వెళ్లేది.
ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత అంతర్జాతీయ అనితా చాను చేత శిక్షణ పొందిన మీరాబాయి కోచ్ నుండి క్రమశిక్షణ నేర్చుకుంది. 2009 లో తన మొదటి జాతీయ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె మొదటి అంతర్జాతీయ పతకం 2012 లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో వచ్చింది. మీరాకు అప్పుడు కాంస్య పతకం లభించింది.
Mirabai Chanu
2014 లో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 170 కిలోల లిఫ్ట్‌తో మహిళల 48 కిలోల బరువు విభాగంలో రజత పతకం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మీరాకు నిరాశ ఎదురైంది. 2017 లో అమెరికాలోని అనాహైమ్‌లో 194 కిలోలతో ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com