క్రీడలు

ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన సింధు

Tokyo Olympics 2021: డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిక్ ఫెల్ట్ పై వరుస సెట్లలో విజయం

ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన సింధు
X

PV Sindhu file photo

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిక్ ఫెల్ట్ పై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. తొలి సెట్ ను 21-15 తో గెల్చుకున్న సింధు, తరువాతి సెట్ ను 21- 13తో గెల్చుకొని మ్యాచ్ ను కైవసం చేసుకుంది. మొదటి నుంచి సింధు ఆధిపత్యం ప్రదర్శించినా.. మియా మాత్రం అంత తేలికగా పాయింట్లు ఇవ్వలేదు. అయితే ప్రత్యర్థిని ప్రెజర్ లోకి నెట్టిన సింధు.. చివరికి ఎలాంటి ఇబ్బంది పడకుండానే విజయం సొంతం చేసుకుంది. వరుసగా మూడు విజయాలతో సింధు గ్రూప్‌ జే లో అగ్రస్థానంలో నిలిచింది.

Next Story

RELATED STORIES