Tokyo Olympics: 'చాను' కోసం 'డామినోస్'.. ఓ వాగ్ధానం..

Tokyo Olympics: చాను కోసం డామినోస్.. ఓ వాగ్ధానం..
X
ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించి దేశ కీర్తి ప్రతిష్టలను వినువీధుల్లో ఎగుర వేసింది.

Tokyo Olympics: ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించి దేశ కీర్తి ప్రతిష్టలను వినువీధుల్లో ఎగుర వేసింది. ఈ సందర్భంగా ఆమె దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరాబాయి చానుకు జీవితకాలం ఉచితంగా పిజ్జా ఇస్తామని డొమినోస్ వాగ్దానం చేసింది.

"ఈ అద్భుతమైన క్షణాన్ని మిరాబాయి చాను ప్రియమైన వారితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆమె భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తెచ్చిపెట్టింది. మా డొమినో ఇంఫాల్ బృందం చాను కుటుంబంతో విజయాన్ని జరుపుకోవడానికి ఓ చిన్న టోకెన్‌ను ఆమెకివ్వాలనుకుంటుంది" అని డొమినోస్ ఇండియన్ ట్వీట్ చేశారు.

డొమినోస్ ఇండియా రజత పతక విజేత మీరాబాయి చానుకు జీవితకాలం ఉచితంగా పిజ్జా అందించాలనుకుంటున్నట్లు తెలిపింది. డొమినోస్ ఇంఫాల్ బృందం ఆమె కుటుంబానికి మరియు ప్రియమైన వారికి పిజ్జా పంచింది. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించి భారతీయులకు గర్వకారణంగా నిలిచింది. 21 సంవత్సరాల తరువాత ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిప్టింగ్ పోటీలకు గాను మీరాబాయి చాను పతకం సాధింది.

టోర్నమెంట్ ముగిసిన తరువాత "మొదట, నేను వెళ్లి పిజ్జా తింటాను. పిజ్జా తిని చాలా కాలం అయ్యింది.. అని చాను పిజ్జా తినడం పట్ల తన ఇష్టాన్ని ప్రకటించింది."

Tags

Next Story