సాహో ఇండియా.. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ మెడల్

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పురుషుల హాకీ టీం చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ కాంస్య పతాకం పోరులో మన్‌ప్రీత్ సింగ్ సేన జయకేతనం ఎగరేసింది. టగ్ ఆఫ్ వార్‌గా భావించిన పోరులో జర్మనీని 5-4 తేడాతో ఓడించింది. 41ఏళ్ల తర్వాత తర్వాత ఒలింపిక్ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం ఉదయం నార్త్ పిచ్‌లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం పోటీ జరిగింది. మ్యాచ్ ఆరంభంలో టీమిండియా తడబడినట్లు కనిపించింది. రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టింది.
ఇక రెండో క్వార్టర్‌లో సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమంగా ముగిసింది. మూడో క్వార్టర్‌లో మ్యాచ్ రసవర్తరంగా సాగింది. మూడో క్వార్టర్‌లో భారత్ ఆధిపత్యం చేయాలయించింది. దాంతో 4-3తో ఆధిక్యం కనబరిచింది. జర్మనీ రెండు గోల్స్ కొట్టగా.. ఆ వెంటనే భారత్ మరో గోల్ కొట్టింది. మూడో క్వార్టర్ ఆరంభంలోనే గోల్ సాధించి. ఆపై పెనాల్టీ కార్నర్‌ను అందిపుచ్చుకుని 3-3తో సమం చేసింది. వెంటనే గోల్ కొట్టిన ఇండియా 5-3 ఆధిక్యంలో నిలిచింది.
జర్మనీకి గోల్ దక్కకుండా భారత్ డిఫెండింగ్ గేమ్ ఆడింది. ఆఖర్లో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్ విఫలం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. జర్మనీ షూట్ అవుట్ పెనాల్టీ భారత్ నిలువరించడంతో విజయం లాంఛనమైంది. ఈ మ్యాచ్ జర్మనీపై 4-5తో విజయం సాధించింది భారత్. ఈ విజయంతో భారత్ 41 ఏళ్ల తర్వాత మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com