ఒలింపిక్స్ పతకంపై ఆశలు రేకెత్తిస్తున్న భారత రెజ్లర్ పునియా

భారత అగ్రశ్రేణి రెజ్లర్ భజరంగ్ పునియా తిరుగులేని ఫామ్ కొనసాగిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకానికి చేరువ అవుతున్నాడు. 65 కేజీల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు. పిన్‌డౌన్ సాయంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. కేవలం 4 నిమిషాల 46 సెకన్లలోనే పోరు ముగించాడు. సెమీస్‌లో అజర్ బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీతో తలపడనున్నాడు.
మొదటి పిరియడ్‌లో ఇద్దరు ఆటగాళ్లూ హోరాహోరీగా తలపడ్డారు. ఉడుం పట్టు బిగించారు. దాదాపుగా రక్షణాత్మకంగా ఆడారు. దాంతో మోర్తజా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో రౌండ్‌లోనూ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టే ఆడారు. భజరంగ్ కాళ్లను పట్టేసుకున్న మోర్తజా పాయింట్లు సాధించేలా కనిపించాడు. కానీ అతడి ఆటలను భజరంగ్ సాగనివ్వలేదు. ప్రతిదాడి చేసి అడ్డుకున్నాడు. టచ్‌డౌన్ చేసి రెండు పాయింట్లు సాధించాడు. సాంకేతికంగా మెరుగ్గా ఆడే భజరంగ్... సమయం దొరకగానే ప్రత్యర్థిని రింగులో పడేసి పిన్‌డౌన్ చేశాడు. సెమీసుకు దూసుకెళ్లాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com