క్రీడలు

Tokyo Olympics: ఓడినా.. గెలిచిన లవ్లీనా..

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌ లో భారత బాక్సర్‌ లవ్లీనా సెమీస్‌ పోరులో ఓడిపోయింది.

Tokyo Olympics: ఓడినా.. గెలిచిన లవ్లీనా..
X

టోక్యో ఒలింపిక్స్‌ లో భారత బాక్సర్‌ లవ్లీనా సెమీస్‌ పోరులో ఓడిపోయింది. లవ్లీనా ఓడినప్పటికీ.. కాంస్య పతకం దక్కించుకుంది. సెమీఫైనల్‌కు చేరుకోవడంతో పతకాన్ని ఖాయం చేసుకుంది. 69 కేజీల విభాగం జరిగిన బాక్సింగ్‌ పోటీలో.. ప్రపంచ ఛాంపియన్‌ అయిన టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌తో లవ్లీనా పోరాడి ఓడింది.

ఏదేమైనా టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కిలోల విభాగంలో అదరగొట్టింది. క్వార్టర్స్‌ పోరులో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి ఘన విజయం సాధించింది. దీంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. లవ్లీనా కంటే ముందు విజేందర్‌సింగ్‌, మేరీకోమ్‌ మాత్రమే బాక్సింగ్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టారు.

లవ్లీనా సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను సైతం వాయిదా వేసింది అసోం ప్రభుత్వం. లవ్లీనా బుసేనాజ్‌తో తలపడుతున్న సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 30 నిమిషాలపాటు వాయిదా వేసింది.

Next Story

RELATED STORIES