SRH: హైదరాబాద్‌కు షాక్.. హెడ్‌కు కరోనా

ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కరోనాతో బాధపడుతున్నాడు. ‘ట్రావిస్ హెడ్‌కి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. అతను టీమ్‌తో పాటు లక్నోకి రావడం లేదు. తర్వాతి మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకుని, టీమ్‌తో కలుస్తాడని ఆశిస్తున్నాం..’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ వెల్లడించాడు. మే 19న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. 2024 సీజన్ ఫైనల్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2025 సీజన్‌ని ఘనంగా మొదలెట్టింది. మొదటి మ్యాచ్‌లో 286 పరుగులు చేసింది.
ప్లే ఆఫ్స్‌కు దూరమైన హైదరాబాద్
అయితే ఆ తర్వాత వరుస నాలుగు ఓటములతో రేసులో వెనకబడింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 245 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించినా, అదే గెలుపు జోరుని కొనసాగించకపోయింది.. 11 మ్యాచుల్లో 3 విజయాలే అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీతో మ్యాచ్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్ తర్వాత అనుకోకుండా ఐపీఎల్‌కి బ్రేక్ రావడంతో ఫారిన్ ప్లేయర్లు, తమ స్వదేశానికి వెళ్లిపోయారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 కారణంగా ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్... తిరిగి ఐపీఎల్‌కి రారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఐపీఎల్‌లో ఆడిన 3 మ్యాచులు ఆడేందుకు ఇండియాలో వాలారు ఫారిన్ ప్లేయర్లు.. ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ లేకపోయినా మిగిలిన 3 మ్యాచుల్లో గెలిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ 6లో నిలిచే అవకాశం ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com