CWC2023: అసలు మ్యాచ్‌ జరుగుతుందా..లేదా..?

CWC2023: అసలు మ్యాచ్‌ జరుగుతుందా..లేదా..?
ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం... బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌పై నీలినీడలు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా రేపు బంగ్లాదేశ్ శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ఢిల్లీ చేరుకున్నాయి. అయితే అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కాలుష్య తీవ్రత కారణంగా బంగ్లాదేశ్ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను ర్దు చేసుకోవాల్సి వచ్చింది కానీ వాయు కాలుష్యం అధికంగా ఉండడంతో తమ జట్టు ఎలాంటి ఛాన్స్ తీసుకోదల్చుకోలేదని బంగ్లా టీమ్ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం అతి తీవ్రస్థాయిలో ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ AQI 504 కి చేరింది. విషపూరిత పొగమంచు దేశ రాజధానిని కమ్మేయడంతో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది. శ్రీలంక కూడా ఇప్పటికే ప్రాక్టీస్‌ సెషన్‌ను విరమించుకుంది. శనివారం మొత్తం హోటల్‌కే పరిమితం కావాలని శ్రీలంక నిర్ణయం తీసుకుంది. కానీ బంగ్లా జట్టు శనివారం సాయంత్రం మాస్కులు ధరించి కాసేపు మైదానంలో గడిపింది. మంగళవారం వరకు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.


ఢిల్లీలో కాలుష్యంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC స్పందించింది. గాలి నాణ్యతను పరీక్షించిన తర్వాత మ్యాచ్‌ జరపాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లా-శ్రీలంక మ్యాచ్‌ నిర్వహణ కష్టమే కావచ్చు.

ఒకవేళ ఈ మ్యాచ్‌ జరిగితే శ్రీలంకకు విజయం కీలకం కానుంది. సెమీఫైనల్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినా సాంకేతికంగా లంకేయులకు అవకాశం ఉంది. ఆ అవకాశాలు ఉండాలంటే బంగ్లాపై లంక గెలవాలి. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో జరిగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడానికి శ్రీలంక ఏడో స్థానంలోనే ఉండాలి. అంటే ఈ మ్యాచ్‌లో తప్పక లంక గెలవాలి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఇప్పటివరకూ 53 వన్డేలు ఆడగా లంక 49 మ్యాచుల్లో బంగ్లా 9 మ్యాచుల్లో గెలిచాయి.

బంగ్లాదేశ్ జట్టు:

షకీబుల్ హసన్ (కెప్టెన్‌), లిట్టన్‌దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిది హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, తస్కిన్ , ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.

శ్రీలంక జట్టు:

కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సంక, లహిరు కుమార, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, థీక్షణ, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత, ఏంజెలో మాథ్యూస్, దిల్‌షాన్ మథ్యూస్, దిల్‌షాన్ మాథ్యూస్ కరుణరత్నే.

Tags

Read MoreRead Less
Next Story