క్రీడలు

PV Sindhu : పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం..!

PV Sindhu : టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

PV Sindhu : పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం..!
X

PV Sindhu : టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సింధుతో పాటుగా కాంస్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆమె కోచ్‌ పార్క్‌ తై సేంగ్‌ను కూడా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, నిర్మలా సీతారామన్‌, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ కి చేరుకున్న సింధుకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇలా వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించడం విశేషం.

Next Story

RELATED STORIES