UPASANA KONIDELA: తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్మన్‌గా ఉపాసన

మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కీలక బాధ్యతలు అందుకున్నారు. ఆమెను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించారు . ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకంపై సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను క్రీడా కేంద్రంగా టాప్ లో ఉంచేందుకు స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ క్రమంలోనే స్పోర్ట్స్ హబ్ ను స్థాపించింది. ఈ స్పోర్ట్స్ హబ్ కు సంజీవ్ గోయెంకాను ప్రభుత్వం నియమించింది.
నా కోడలు: చిరంజీవి
కోడలికి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్‌గా అవకాశం దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. క్రీడల అభివృద్ధికి ఉపాసన నియామకం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది గొప్ప బాధ్యతతో పాటు మా కోడలికి దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు. ఉపాసన నిబద్ధత, అభిరుచి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ హబ్ చైర్మన్‌గా గోయోంకా
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు చైర్మన్‌గా సంజీవ్‌కుమార్ గోయంకాను, కో-చైర్మన్‌గా కామినేని ఉపాసనను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ పాలసీలో భాగంగా స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా కొత్తగా చైర్మన్లను ఎంపిక చేసింది. సంజీవ్ గోయెంకా ఐపీఎల్‌లో లక్నో జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఉపాసన.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను క్రీడా కేంద్రంగా మార్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com