Uppal Cricket Stadium: అదరగొట్టేశాడుగా...

X
By - Chitralekha |18 Jan 2023 5:57 PM IST
గిల్.. జిగేల్ డబుల్ సెంచరీ
ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్ లతో 208 పరుగులు సాధించాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.
టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగగా...ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన గిల్ చివరి వరకు నిలిచి డబుల్ సెంచరీ సాధించాడు.
కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5) రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) పరుగులు చేయగా... కుల్దీప్ యాదవ్ (5*), షమి (2*) నాటౌట్‌గా నిలిచారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com