US OPEN: యూఎస్ ఓపెన్ విజేత అల్కరాజ్

యూఎస్ ఓపెన్‌లో కార్లోస్ అల్కరాస్ చరిత్ర సృష్టంచాడు. పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో యానిక్ సినర్‌ను 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో మట్టికరిపించాడు. ఈ విజయంతో 65 వారాలుగా ప్రపంచ నంబర్ 1 స్థానంలో ఉన్న సినర్‌ను వెనక్కి నెట్టి అల్కరాస్ మళ్లీ టాప్ ర్యాంకు దక్కించుకున్నాడు. మొత్తం 2 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఫైనల్‌లో తొలిసెట్‌ను అల్కరాస్ అలవోకగా నెగ్గాడు. రెండో సెట్‌లో కార్లోస్ తేలిపోయినప్పటికీ, మూడో సెట్‌లో విజృంభించాడు. దూకుడుగా ఆడి 6-1 తేడాతో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక కీలక నాలుగో సెట్‌లో ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డప్పటికీ అల్కరాస్ ఒత్తిడిని అధిగమించి విజేతగా అవతరించాడు.
క్వీన్ సబలెంక
యూఎస్ ఓపెన్‌లో బెలారస్ భామ అరీనా సబలెంక చరిత్ర సృష్టించింది. యూఎస్ ఎపెన్ 2025 టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అమెరికాలో జరిగిన ఫైనల్లో అమండా అనిసిమోవాను ఓడించి విజేతగా నిలిచింది. ఆర్థర్ ఆషె స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫినాలెలో కేవలం ఒక గంట 34 నిమిషాల్లోనే 6-3, 7-6 (3) తేడాతో యూఎస్ ప్లేయర్ అనిసిమోవాను మట్టి కరిపించింది సబలెంక. ఈ గెలుపుతో సబలెంక ఖాతాలో నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరింది. రెండు ఆస్ట్రేలియా ఓపెన్, ఒక యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్న సబలెంక.. మరో యూఎస్ గ్రాండ్ స్లామ్ గెలిచింది. పదేండ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ ను నిలబెట్టుకున్న ప్లేయర్ గా ఈ బెలారస్ ప్లేయర్ నిలిచింది. 2014లో సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ వరుసగా నిలబెట్టుకుంది. ఈ ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ రెండింటిలో రన్నరప్ గా నిలిచిన సబలెంక.. లోపాలను సరిదిద్దుకుని ఎట్టకేలకు టైటిల్ ను అందుకుంది. వింబుల్డన్ సెమీస్ ఓటమికి ఫైనల్ లో అనిసిమోవాపై ప్రతీకారం తీసుకుంది.
నాలుగో గ్రాండ్‌స్లామ్
సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అన్ని టైటిళ్లను ఆమె హార్డ్కోర్ట్లపైనే సాధించింది. దీంతో ఆమెకు హార్డ్కోర్డ్ల రాణిగా గుర్తింపు వచ్చింది. సబలెంక 2023, 2024లో వరుసగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు సాధించి.. 2024, 2025లో వరుసగా యూఎస్ ఓపెన్‌ను గెలిచింది. వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించడంతో సబలెంక సెరీనా విలియమ్స్ సరసన చేరింది. సెరీనా కూడా గతంలో వరుసగా రెండు ఎడిషన్లలో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది. టైటిల్ గెలిచిన అనంతరం సబలెంక మాట్లాడుతూ.. ఇగా స్వియాటెక్, నవోమి ఒసాకాను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న అనిసిమోవా టాప్ సీడ్ సబలెంకాను మాత్రం ఓడించలేకపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com