us open: ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహా సంగ్రామం

యూఎస్ ఓపెన్ 2025లో టెన్నిస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. 24 గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్, ప్రస్తుతం టెన్నిస్ లో సంచలనంగా మారిన కార్లోస్ అల్కరాజ్ సెమీ ఫైనల్లో తలపడనున్నారు. వీరిద్దరూ తమ తమ క్వార్టర్ ఫైనల్లో అలవోక విజయాలు సాధించి కఠిన సవాలుకు సిద్ధమయ్యారు. తొలి క్వార్టర్ ఫైనల్లో జిరి లెహెక్కాను అల్కరాజ్ వరుస సెట్లలో ఓడించాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 6-4, 6-2, 6-4 తేడాతో సునాయాసంగా గెలిచాడు. వరల్డ్ నెంబర్ 2 ర్యాంక్ లో ఉన్న అల్కరాజ్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఇప్పటివరకు మెన్స్ విభాగంలో ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా యూఎస్ ఓపెన్ గెలవలేదు. సెమీస్ లో జొకోవిచ్ తో మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి నోవాక్ జొకోవిచ్ 14వ సారి యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 38 ఏళ్ల సెర్బియన్ స్టార్ 6-3, 7-5, 3-6, 6-4 తేడాతో గెలిచి, ఫ్రిట్జ్‌పై ఒక్కసారి కూడా ఓడిపోని రికార్డును కొనసాగించాడు. సెమీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న కార్లోస్ అల్కరాజ్తో జొకోవిచ్ తలపడతాడు. అల్కరాజ్ తో గెలిస్తే ఫైనల్లో సిన్నర్ తో ఆడే అవకాశముంది.
యుకీ బాంబ్రీ రికార్డు
భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. డబుల్స్‌లో తన సహచరుడు మైకెల్ వెనుస్తో కలిసి యుకీ యూఎస్ ఓపెన్ బరిలోకి దిగాడు. వీరిద్దరికి 14వ సీడ్ దక్కింది. అయితే, ప్రీక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జోడీ కెవిన్ క్రావిట్జ్ - టిమ్ పూయిట్జ్పై 6-4, 6-4 తేడాతో యుకీ జోడీ విజయం సాధించింది. దాదాపు గంటన్నరపాటు జరిగిన పోరులో పైచేయి సాధించారు. క్వార్టర్స్‌లో క్రొయేషియాకు చెందిన నికోలా మోక్టిక్ - అమెరికా ప్లేయర్ రాజీవ్‌రామ్‌తో యుకీ - మైకెల్ తలపడనున్నారు. 33 ఏళ్ల యుకీ బాంబ్రీ ఇప్పటివరకు సింగిల్స్‌లో ఒక్కసారి కూడా గ్రాండ్‌స్లామ్‌ల్లో తొలి రౌండ్‌ను కూడా అధిగమించలేదు. కానీ, డబుల్స్‌లో కాస్త ఫర్వాలేదు. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో మూడో రౌండ్ వరకూ చేరాడు. ఇప్పుడు మొదటిసారిగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. నాలుగో సీడ్‌కే షాక్ ఇచ్చిన యుకీ జోడీ క్వార్టర్స్‌లో 11వ జోడీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు. మరో రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తేనే ఫైనల్‌కు చేరుకొనే అవకాశం ఉంది.
లక్ష్యం దిశగా జెస్సికా పెగూలా
సొంతగడ్డపై తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా ఆ దిశగా మరో అడుగు వేసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జెస్సికా 6–3, 6–3తో ప్రపంచ 62వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్ ఓపెన్, 2024 వింబుల్డన్ టోర్నీ విజేత బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్ జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ప్రపంచ మూడో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో 2023 చాంపియన్ కోకో గాఫ్‌ను ఓడించింది. వరుస సంచలనాతో ఈసారి యూఎస్ ఓపెన్ రసవత్తరంగా సాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com