FRENCH OPEN: మట్టి కోర్టు కొత్త యువరాణి గాఫ్

అమెరికా సంచనలం కొకో గాఫ్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించింది. మహిళల సింగిల్స్‌లో అరీనా సబలెంకపై అద్భుత విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఉత్కంఠ పోరులో పట్టువదలకుండా చెలరేగిన తను ప్రత్యర్థికి చెక్ పెట్టింది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ తన మార్క్ ఆటతో విరుచుకుపడ్డ గాఫ్.. చివరి రెండు సెట్లు గెలుపొందిన తన కలను సాకారం చేసుకుంది. రోలాండ్ గారోస్‌లో జరిగిన మూడుసెట్ల హోరాహోరీ ఫైనల్లో గాఫ్.. టాప్‌సీడ్, బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకపై సంచలన విజయం సాధించింది. తొలిసెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన గాఫ్.. ఆ తర్వాత రెండుసెట్లను చేజిక్కించుకొని ఫ్రెంచ్‌ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తొలిసారి ముద్దాడింది. మూడోసెట్‌లో తొలుత బ్రేక్ పాయింట్ సాధించిన గాఫ్.. ఆ ఆధిక్యతను చివరి వరకు నిలుపుకొని విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో గాఫ్ 6-7(5-7), 6-2, 6-4తో సబలెంకను చిత్తుచేసింది.
టెన్నిస్‌లో సంచలనం
సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తర్వాత అమెరికా టెన్నిస్‌లో సంచలనంగా మారిన గాఫ్.. 2023లో యూఎస్ ఓపెన్ విజేతగా చరిత్ర సృష్టించింది. తన ఆటతో అదరగొడుతున్న ఈ టీనేజరర్ ఇప్పటివరకూ 7 డబ్ల్యూటీఏ టూర్ సింగిల్స్ ట్రోఫీలు కొల్లగొట్టింది. మరోవైపు పురుషుల సింగిల్స్ టైటిల్ సంగ్రామం నేడు రొలాండ్ గారోస్‌లో జరగనుంది. టాప్‌ా2 ఆటగాళ్ల మధ్య ఈ టైటిల్ పోరు జరగనుంది. టాప్‌సీడ్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ), 2వ సీడ్, కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్)ల మధ్య ఈ సంగ్రామం జరగనుంది. అల్కరాజ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో నిలువగా.. టాప్‌సీడ్ సిన్నర్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com