VAIBHAV: కొత్త చరిత్ర సృష్టించేందుకు వైభవ్ సిద్ధం

VAIBHAV: కొత్త చరిత్ర సృష్టించేందుకు వైభవ్ సిద్ధం
X
టీమిండియాలోకి భారత్ టీన్ సంచలనం... భారత జట్టు తరపున త్వరలో అరంగేట్రం... పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించే ఛాన్స్

భారత క్రి­కె­ట్‌­లో కొ­త్త సం­చ­ల­నం సృ­ష్టి­స్తు­న్న యువ ఆట­గా­డు వై­భ­వ్ సూ­ర్య­వం­శీ పేరు ఇప్పు­డు జా­తీయ స్థా­యి­లో మా­ర్మో­గు­తోం­ది. చి­న్న వయ­సు­లో­నే అసా­ధా­రణ ప్ర­తి­భ­ను కన­బ­రు­స్తూ అభి­మా­ను­ల­ను ఆక­ట్టు­కు­న్న ఈ కు­ర్రా­డు, త్వ­ర­లో­నే చరి­త్ర సృ­ష్టిం­చే అం­చున ని­లి­చా­డు. టీమ్ ఇం­డి­యా తర­ఫున అరం­గే­ట్రం చేసే అత్యంత పి­న్న వయ­స్కు­డి­గా ని­లి­చే అవ­కా­శం అతని ముం­దుం­ది. ఇప్ప­టి­వ­ర­కు ఈ రి­కా­ర్డు క్రి­కె­ట్ ది­గ్గ­జం సచి­న్ టెం­డూ­ల్క­ర్ పే­రిట ఉం­డ­గా, ఇప్పు­డు ఆ గౌ­ర­వం వై­భ­వ్ సూ­ర్య­వం­శీ­కి దక్కే అవ­కా­శా­లు కని­పి­స్తు­న్నా­యి. క్రి­కె­ట్ వర్గా­ల్లో వి­ని­పి­స్తు­న్న సమా­చా­రం ప్ర­కా­రం, త్వ­ర­లో జర­గ­ను­న్న ఐర్లాం­డ్ పర్య­ట­న­లో వై­భ­వ్‌­కు జా­తీయ జట్టు­లో చోటు దక్కే అవ­కా­శా­లు బలం­గా ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఇప్ప­టి­కే బీ­సీ­సీఐ సె­ల­క్ష­న్ కమి­టీ సి­ద్ధం చే­సిన షా­ర్ట్‌­లి­స్ట్‌­లో అతని పేరు ఉన్న­ట్లు వి­శ్వ­స­నీయ వర్గా­లు పే­ర్కొం­టు­న్నా­యి. అధి­కా­రిక ప్ర­క­టన ఇంకా వె­లు­వ­డ­క­పో­యి­నా, అతని ఎం­పిక దా­దా­పు ఖాయం అన్న అభి­ప్రా­యం వ్య­క్త­మ­వు­తోం­ది. ఐపీ­ఎ­ల్ ము­గి­సిన కొ­ద్ది రో­జు­ల­కే భా­ర­త్ జట్టు ఐర్లాం­డ్ పర్య­ట­న­కు వె­ళ్ల­నుం­డ­గా, ఈ సి­రీ­స్ ద్వా­రా వై­భ­వ్ అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో అడు­గు­పె­ట్టే అవ­కా­శ­ముం­ది.

ఐపీఎల్లో ఊచకోత

ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో, అలాగే ఐపీఎల్ వేదికపై వైభవ్ తన ప్రతిభను ఘనంగా చాటుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసం, షాట్ల ఎంపిక, ఆటపై ఉన్న పట్టు నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అతను ఆడిన మ్యాచ్‌ల్లో చాలా వరకు దూకుడైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన ప్రత్యేకతను నిరూపించాడు. హై­ద­రా­బా­ద్‌­పై మ్యా­చ్ మి­న­హా మి­గ­తా మ్యా­చ్‌­ల్లో అతని బ్యా­టిం­గ్ ఆక­ట్టు­కుం­ది. ఇంత చి­న్న వయ­సు­లో­నే ఇం­త­టి పరి­ప­క్వ­త­తో ఆడటం అరు­దైన వి­ష­యం అని క్రి­కె­ట్ వి­శ్లే­ష­కు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. వై­భ­వ్ ఎం­పి­క­కు బీ­సీ­సీఐ వర్గా­లు కూడా సా­ను­కూ­లం­గా ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. సె­ల­క్ట­ర్లు అతని ఆట­తీ­రు­ను సమ­గ్రం­గా పరి­శీ­లిం­చి సం­తృ­ప్తి వ్య­క్తం చే­సి­న­ట్లు సమా­చా­రం. ము­ఖ్యం­గా ఎమ­ర్జిం­గ్ ఆసి­యా కప్‌­లో అతను చూ­పిన ప్ర­తిభ సె­ల­క్ష­న్ కమి­టీ­ని ఆక­ట్టు­కు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. అం­తే­కా­కుం­డా, ఇటీ­వల అతను వయ­స్సు­కు సం­బం­ధిం­చిన ని­బం­ధ­న­ల­ను కూడా పూ­ర్తి చే­సిన నే­ప­థ్యం­లో జా­తీయ జట్టు­లో­కి ఎం­పి­క­కు అర్హత సా­ధిం­చా­డు.

ఇక ఐర్లాం­డ్ పర్య­ట­న­లో అతను మె­రు­గైన ప్ర­ద­ర్శన చే­స్తే, తరు­వాత జర­గ­ను­న్న జిం­బా­బ్వే సి­రీ­స్‌­లో కూడా అత­ని­కి అవ­కా­శం దక్కే అవ­కా­శా­లు ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. అంటే, ఇది కే­వ­లం అరం­గే­ట్రం మా­త్ర­మే కా­కుం­డా, అతని అం­త­ర్జా­తీయ కె­రీ­ర్‌­కు బల­మైన పు­నా­ది కా­వ­చ్చు. అతని ప్ర­తి­భ­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని, భవి­ష్య­త్తు­లో టీమ్ ఇం­డి­యా­లో కీలక ఆట­గా­డి­గా ఎది­గే సా­మ­ర్థ్యం ఉన్న­ట్లు ని­పు­ణు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. ప్ర­స్తు­తం భారత పు­రు­షుల జట్టు­లో అత్యంత పి­న్న వయ­సు­లో అరం­గే­ట్రం చే­సిన ఆట­గా­డి­గా సచి­న్ టెం­డూ­ల్క­ర్ పేరు చరి­త్ర­లో ని­లి­చిం­ది. ఆయన 16 ఏళ్ల వయ­సు­లో ఈ ఘనత సా­ధిం­చా­రు. ఇప్పు­డు వై­భ­వ్ ఆ రి­కా­ర్డు­ను అధి­గ­మిం­చే అవ­కా­శా­లు కని­పి­స్తు­న్నా­యి. కాగా మొ­త్తం భారత క్రి­కె­ట్ చరి­త్ర­లో అత్యంత పి­న్న వయ­సు­లో అం­త­ర్జా­తీయ మ్యా­చ్ ఆడిన ఆట­గా­డి­గా మహి­ళా క్రి­కె­ట­ర్ షఫాలీ వర్మ పేరు ఉంది. ఆమె 15 ఏళ్ల 7 నెలల 27 రో­జుల వయ­సు­లో­నే భా­ర­త్ తర­ఫున అరం­గే­ట్రం చే­సిం­ది. వైభవ్ రికార్డుల కోసం క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది.

Tags

Next Story