VAIBHAV: వైభవ్ భవిష్యత్తుపై స్టీవ్ వా సంచలన వ్యాఖ్యలు

టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి క్రికెట్ ప్రపంచంలో నెలకొంది. చిరు ప్రాయంలోనే దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని ఐపీఎల్ సెంచరీ సాధించిన అతడి ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. సీనియర్ క్రికెటర్లు అనేక మంది సూర్యవంశీ ఎదుర్కోబోయే సవాళ్ల గురించి వివిధ వేదికల్లో లేవనెత్తుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ స్టీ వా కూడా వైభవ్‌కు ఎదురుకానున్న సవాళ్ల గురించి ప్రస్తావించారు. ఆటపై పట్టు సాధించడమే సూర్యవంశీకి అతి పెద్ద సవాలు కాబోతోందని స్టీవ్ వా అన్నాడు. తాను ఆ సెంచరీని చూశానన్న స్టీవ్ వా... ఆ శతకాన్ని తాను నమ్మలేకపోయానని వెల్లడించారు. ప్రతి బంతిని అత్యంత సులువుగా అతడు బౌండరీ బాట పట్టించాడని స్టీవ్ అన్నాడు. అసలే మాత్రం ఒత్తిడి లేకుండా ఆడాడని స్టీవ్ వెల్లడించాడు. ఒత్తిడి అంటే ఏంటో తెలియని 14 ఏళ్ల చిరుప్రాయంలో అతడు క్రికెట్ ఆడటం చూస్తుంటే అద్భుతంగా అనిపించిందని స్టీవ్ వెల్లడించాడు. ఇదే తీరుతో పూర్తి నియంత్రణతో భవిష్యత్తులో కూడా ఆడటం అతడు ఎదుర్కొనే సవాలని ఆస్ట్రేలియా మాజీ సారధి వెల్లడించాడు. సూర్యవంశీకి టాలెంట్‌తో పాటు మానసిక స్థిరత్వం ఉందని కితాబునిచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com