VAIBHAV: ఆస్ట్రేలియాపై అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ

ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 ప్లేయర్లు అదరగొడుతున్నారు. కంగారులను బెంబేలెత్తిస్తున్న మన యువ క్రికెటర్లు వరుసగా రెండో వన్డేలోనూ నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే యూత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. ఇప్పటికే తొలి వన్డేలో గెలుపొందిన భారత అండర్-19 జట్టు బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ సత్తాచాటింది. 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్‌పై భారీ విజయం సాధించింది. ముందుగా భారత్ 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(70), అభిగ్యాన్ కుండు(71), విహాన్ మల్హోత్రా(70) సంచలన ప్రదర్శన చేశారు. వైభవ్ సూర్యవంశీ (70; 68 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. ఈ 14 ఏళ్ల కుర్రాడు అలవోకగా సిక్సర్లు బాదేశాడు. చేజింగ్‌లో ఆసిస్ తేలిపోయింది. జైడెన్ డ్రాపర్(107) మాత్రమే పోరాడాడు. దీంతో ఆ జట్టు 47.2 ఓవర్లలో 249 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ఆయుశ మాత్రే 3 వికెట్లు, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లతో సత్తాచాటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com