Asian Games: ఆసియా క్రీడల వేళ భారత్‌కు పెద్ద షాక్

ఆసియా క్రీడల (Asian Games)కు నేరుగా ప్రవేశం పొందిన( granted a direct entry) స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Wrestler Vinesh Phogat) ఆ పోటీల నుంచి వైదొలిగింది. మోకాలి గాయం కారణంగా వచ్చే నెలలో జరగబోయే ఆసియా క్రీడల్లో తాను పాల్గొనడం లేదని వినేశ్ ఫొగాట్ వెల్లడించింది. గాయం కారణంగా ఎడమ మోకాలికి గాయమైందని.. అందుకే ఆసియా క్రీడల నుంచి వైదొలుగుతున్నట్లు సామాజిక మాధ్యమంలో(posted on X) ఆమె సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
ఆగస్టు 13న ప్రాక్టీస్ చేస్తుండగా తన ఎడమ మోకాలి( Vinesh disclosed her injury)కి గాయమైందని పోస్ట్‌లో వినేశ్ వివరించింది. తాను వెంటనే వైద్యులను సంప్రదించానని, స్కాన్లు, ఇతర పరీక్షలు చేసిన తర్వాత సర్జరీ ఒక్కటే మార్గమని వైద్యులు సూచించారని పేర్కొంది. ఆగస్టు 17న ముంబయి(17th August in Mumbai)లో సర్జరీ చేయించుకుంటున్నానని వెల్లడించింది. 2018లో జకార్త ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచినట్లే ఈసారి బంగారు పతకం గెలుద్దామని కలలు కన్నానని.. కానీ గాయం కారణంగా అవి నెరవేరడం లేదని వినేశ్ ఫొగాట్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే రెజ్లింగ్ అధికారులకు తెలియజేశానని.. ఇక తన బదులుగా ఆసియా క్రీడలకు రిజర్వ్ ఆటగాళ్లకు పంపేందుకు వీలుంటుందని వివరించింది. ఇప్పటివరకు తనపై చూపించిన ప్రేమను ఇకముందు కూడా కొనసాగించాలని అభిమానులను వినేశ్ ఫొగాట్ విజ్ఞప్తి చేసింది. 2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు మీ అందరీ ఆశీస్సులతో సిద్ధమవుతానని వివరించింది.
వినేశ్ పోటీల నుంచి వైదొలడంపై ఆమె స్థానంలో అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. అండర్-20 ప్రపంచ ఛాంపియన్ అయిన పంగాల్ ఇప్పటికే ట్రయల్స్‌లో గెలిచి ఆసియా క్రీడలకు స్టాండ్‌బైగా ఎంపికైంది. సెప్టెంబరు 23 నుంచి హాంగ్‌ఝౌ(Hangzhou) వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి.
ప్రముఖ రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్(Vinesh and Bajrang Punia)కు ట్రయల్స్ నుంచి మినహాయింపునిచ్చి.. ఆసియా క్రీడల్లో నేరుగా ప్రవేశం కల్పిస్తూ డబ్ల్యూఎఫ్‌ఐ అడ్‌హక్ కమిటీ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై రెజ్లర్లు అంతిమ్ పంగాల్, సుజీత్ కల్కల్ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే వీరి పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com