Vinod Kambli : మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి జాబ్ ఆఫర్ చేసిన బిజినెస్ మ్యాన్.. జీతం..

Vinod Kambli : మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి జాబ్ ఆఫర్ చేసిన బిజినెస్ మ్యాన్.. జీతం..
Vinod Kambli : మహారాష్ట్రకు చెందిన సందీప్ థోరట్ అనే వ్యాపారవేత్త మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి నెలకు రూ. 1 లక్ష జీతంతో ఉద్యోగం ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం.

Vinod Kambli: మహారాష్ట్రకు చెందిన సందీప్ థోరట్ అనే వ్యాపారవేత్త మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి నెలకు రూ. 1 లక్ష జీతంతో ఉద్యోగం ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం, భారత మాజీ క్రికెటర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో అతడికి జాబ్ ఆఫర్ చేశారు ప్రముఖ వ్యాపార వేత్త.

ఎవరైనా ఫామ్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటారు.. సినిమా సెలబ్రెటీలైనా, స్పోర్ట్స్ పర్సన్స్ అయినా.. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు.. కానీ ఏ కొద్దిమందికో ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు.. భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది.

ఇటీవల కాంబ్లీ తన ఆర్థిక ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో వాపోయాడు. తనకి బీసీసీఐ నుంచి నెలకు రూ.30,000 మాత్రమే అందుతున్నట్లు చెప్పాడు. నా ఏకైక ఆదాయ వనరు అదే.. బోర్డుకి కృతజ్ఞతలు అని కాంబ్లీ మిడ్ డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

"నాకు అసైన్‌మెంట్‌లు కావాలి, అక్కడ నేను యువకులతో కలిసి పని చేయగలను. ముంబై తమ ప్రధాన కోచ్‌గా అమోల్‌ను [ముజుందార్] నియమించారని నాకు తెలుసు. కానీ ఎక్కడైనా నేను అవసరమైతే నన్ను తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు.

"నేను MCA [ముంబై క్రికెట్ అసోసియేషన్] నుండి సహాయం కోరుతున్నాను. నేను CIC [క్రికెట్ ఇంప్రూవ్‌మెంట్ కమిటీ]లోకి వచ్చాను, అది గౌరవప్రదమైన ఉద్యోగం. నేను కొంత సహాయం కోసం MCA కి వెళ్ళాను. నా కుటుంబాన్ని చూసుకోవాలి. మీకు నేను అవసరమైతే వాంఖడే స్టేడియంలో అయినా, BKCలో అయినా ఉంటానని MCAకి చాలాసార్లు చెప్పాను. ముంబై క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. వారికి, ఈ ఆటకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పాడు కాంబ్లీ.

వినోద్ కాంబ్లీ ఆర్థిక ఇబ్బందులు విన్న మహారాష్ట్ర వ్యాపారవేత్త థోరట్ ముందుకు వచ్చి, మాజీ క్రికెటర్‌కు నెలవారీ జీతం రూ.1 లక్షతో ఉద్యోగం ఇచ్చారు. మరాఠీ వెబ్‌సైట్‌ల నివేదికల ప్రకారం, ముంబైలోని సహ్యాద్రి ఇండస్ట్రీ గ్రూప్‌లోని ఫైనాన్స్ విభాగంలో కాంబ్లీకి ఉద్యోగం లభించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story