Virat Kohli : రిషికేష్ ఆశ్రమంలో విరాట్ దంపతులు

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి స్వామి దయానంద సరస్వతీ ఆశ్రమాన్ని దర్శించారు. ఉత్తరాఖండ్ లోని ఆశ్రమానికి.. కూతురు వామికా, భార్య అనుష్క శర్మలతో కలిసి దర్శించుకున్నారు. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆద్యాత్మిక గురువు దయానంద సరస్వతి సమాధిని దర్శించుకున్నారు. ఫిబ్రవరి 9న నాగ్ పూర్ లో తొలిటెస్ట్ మ్యాచ్ మొదలుకానుంది. ఆశ్రమాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. విరాట్ ఆశ్రమాన్ని దర్శించుకోవడంతో క్రికెట్ అభిమానులు చుట్టుముట్టారు. అటోగ్రాఫ్ లకోసం పోటీపడ్డారు. క్రికెట్ బాల్ పై కోహ్లీ సంతకం చేసిచ్చాడు. ఆశ్రమంలో తన అభిమానులు వీడియోలు తీస్తుండటంతో, ఇది ఆశ్రమం బ్రదర్ అని సున్నితంగా వారించాడు కోహ్లీ.
ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరుగనున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో భారత్ అడుగుపెట్టాలంటే, ఈ సిరీస్ ను గెలవడం ఎంతో ముఖ్యం. ఈ సిరీస్ లో సత్తా చాటేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. భారత పర్యటనకు ఆస్టేలియా వచ్చిన ప్రతీసారి టీమిండియా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఈసారి ఆస్ట్రేలియాను పూర్తిగా చిత్తు చేయడానికి ఆటగాళ్లు రెడీగా ఉన్నట్లు టీమిండియా వర్గాలు తెలుపుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com