Virat kohli: బుజ్జాయితో జాలీగా...

ఆధ్యాత్మిక యాత్రల్లో తలమునకలై ఉన్న విరాఠ్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు తాజాగా రిషికేశ్ బాటపట్టిన సంగతి తెలిసిందే. అయితే వారి గారాల పట్టి వామిక కూడా తల్లిదండ్రుల వెంట యాత్రలు చుట్టేస్తోంది. రిషికేశ్ యాత్రలో ట్రెక్కింగ్ చేస్తున్న విరాఠ్.. చిన్నారి వామికను భుజానకెత్తుకుని తీసుకెళుతున్న ఫోటోలు బయటకు రావడంతో ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. అనుష్కా ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ట్రెక్కింగ్ దారిలో సెలయేళ్లు, చెట్లు చేమలు చూసి పులకించిపోతున్న వామిక, ఆమె మురిపాలు తీరుస్తున్న విరాఠ్ ను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి లేదేమో. మరో ఫొటోలో వామిక సెలయేటి నీళ్లను తాకేందుకు ప్రయత్నిస్తుండగా, ఆమెను ఎత్తుకున్న విరాఠ్ ముఖం వేయి వోల్ట్ ల కాంతిని విరజిమ్ముతోందని చెప్పాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com