VIRAT: 13 ఏళ్ల తరువాత రంజీల్లో విరాట్

VIRAT: 13 ఏళ్ల తరువాత రంజీల్లో విరాట్
X
జనవరి 30న రైల్వేస్ తో మ్యాచులో బరిలోకి విరాట్.. రోహిత్ శర్మ ఆడే ఛాన్స్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో కోహ్లీ ఆడనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌ని చూడొచ్చు. ఢిల్లీ జట్టు రైల్వేస్‌తో జనవరి 30 నుంచి జరగనున్న మ్యాచ్‌లో కోహ్లి ఆడనున్నారు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లి ఆడితే 13 ఏళ్ల తర్వాత అతనికి అదే తొలి రంజీ మ్యాచ్ అవుతుంది. జనవరి 23 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, గిల్ పలువురు ఆడనున్నారు.

కోహ్లీ గ్రేటెస్ట్ వైట్‌బాల్ ప్లేయర్: గంగూలీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘81 అంతర్జాతీయ సెంచరీలు చేయడం అసాధారణ విషయం. ప్రపంచం చూసిన గ్రేటెస్ట్ వైట్ బాల్ ప్లేయర్ అతను’ అని ప్రశంసించారు. చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఫామ్‌పై తనకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ ఉందని చెప్పుకొచ్చారు. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియానే ఫేవరెట్ అని దాదా తెలిపారు.

RCB విజయం కోసం మహాకుంభమేళాలో పూజలు

RCB జట్టు ఇప్పటివరకూ IPL ట్రోఫీ గెలుచుకోలేకపోవడం ప్రస్తుతం పెద్ద చర్చకు తెరలేపుతోంది. ఈ జట్టు అభిమానులు ప్రతి సీజన్‌లో 'ఈ సాలా కప్ మనదే' అని ఉత్సాహంగా ఎదురు చూసి చివరికి నిరాశ చెందుతారు. ఈ నేపధ్యంలో ఒక అభిమాని 'మహాకుంభమేళా'లో జెర్సీకి పుణ్యస్నానం చేయించి 144 ఏళ్లలో ఒకసారి వచ్చే ఈ ప్రత్యేక సందర్భం ద్వారా RCB జట్టు విజయం కోసం పూజలు చేయించాడు. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.

అప్పుడు చాలా టెన్షన్‌ పడ్డా: పంత్

IPL మెగా వేలంలో తనను పంజాబ్ కింగ్స్ తీసుకుంటుందేమోనని టెన్షన్ పడ్డానని స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేర్కొన్నారు. ‘వేలం రోజు నాకు ఒకే ఒక టెన్షన్ ఉంది. అది పంజాబ్ కింగ్స్‌. వారి వద్ద అత్యధిక పర్సు ఉంది. శ్రేయస్‌ను పంజాబ్‌ దక్కించుకోవడంతో నేను లఖ్‌నవూ టీమ్‌లో చేరగలనని భావించాను. అందుకు అవకాశం ఉంది. కానీ, చివరికి వేలంలో ఏం జరుగుతుందో తెలీదు. దీంతో టెన్షన్ పడ్డాను’ అని ఓ కార్యక్రమంలో అన్నారు.

Tags

Next Story