పుట్టినరోజు నాడు కోహ్లీ సెంచరీ.. అభినందించిన సోదరి

విరాట్ కోహ్లి నవంబర్ 5 తన 35వ పుట్టినరోజును జరుపుకున్నారు. అతని సోదరి భావనా కోహ్లీ ధింగ్రా సోదరుడిని అభినందించింది. క్రికెట్ లో అతడు సాధిస్తున్న విజయాలను చూసి మురిసిపోతోంది. వారి చిన్న నాటి రోజులను గుర్తుచేసుకుంది.
విరాట్ కోహ్లీ ఎప్పుడూ క్రికెట్‌పై ఆసక్తిని కలిగి ఉండేవాడని, పాఠశాల రోజుల్లో ఆడినప్పుడు తాను అతనికి మద్దతుగా ఉండేదానన్ని తెలిపింది. భావనా కోహ్లి ధింగ్రా ఢిల్లీకి చెందిన హన్స్‌రాజ్ మోడల్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఢిల్లీలోని దౌలత్ రామ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. వ్యాపారవేత్త సంజయ్ ధింగ్రాను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు - మెహక్, ఆయుష్.
విరాట్ కోహ్లీ బ్రాండ్ అయిన 'వన్8 సెలెక్ట్'లో భావనా కోహ్లీ ధింగ్రా కూడా ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. భావనకు కోహ్లీ భార్య అనుష్క శర్మతో చాలా మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత అనుష్కను తమ కుటుంబంలోకి ప్రేమగా స్వాగతించింది భావన.
భావన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇద్దరు సోదరులు విరాట్, వికాస్ తో దిగిన తన చిన్ననాటి ఫోటోలను పంచుకుంటుంది. ఒక విరాట్ క్రికెటర్‌గా తన ప్రారంభ రోజులలో పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆమె తన సోదరుడిపై ప్రేమను కురిపిస్తూ ఫోటోలను ప్రేమగా పంచుకుంది.
ప్రపంచ కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించినప్పుడు, భావనా కోహ్లీ ధింగ్రా తన సోదరుడిని ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది, "గర్వంగా ఉంది అనేది చాలా చిన్న పదం, ఎందుకంటే మీరు దీన్ని సాధించడానికి ఎంతో కష్టపడ్డారు. ఆటపై మీకు ఉన్న ప్రేమ, అభిరుచి మీ ప్రతి అడుగులో కనబడుతుంది. మీ విజయాలను చూసే అదృష్టం మాకు కలిగినందంకు మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు." మీకు మరిన్ని విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని భావన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com