KOHLI: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. టీ 20 ఫార్మాట్‌లో 400 మ్యాచ్‌లు ఆడిన మూడో టీమిండియా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. కోహ్లీ కంటే ముందు రోహిత్ శర్మ(448), దినేశ్ కార్తీక్ (412) ఈ ఫీట్ సాధించారు. అలాగే, IPLలో నాలుగు జట్లపై వెయ్యి పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ఆరంభ మ్యాచులో బెంగళూరు ఘన విజయం సాధించింది. కేకేఆర్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 16.2 ఓవర్లలోన లక్ష్యాన్ని ఛేదించారు. విరాట్ కోహ్లీ (36 బంతుల్లో 59 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ఫిఫ్టీ చేసి జట్టును విజయం వైపు నడిపించాడు. ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56,0 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఫిఫ్టీతో సత్తా చాటాడు.
కోహ్లీకి మరో అదురైన గౌరవం
విరాట్ కోహ్లీకి మరో అదురైన గౌరవం దక్కింది. విరాట్ కోహ్లీకి ‘ఐపీఎల్ 18’ మెమెంటోను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రదానం చేశారు. IPLలో మొదటి సీజన్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడిన ఏకైక ఆటగాడు గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీకి ప్రత్యేక మొమెంటోతో సత్కరించారు. బోల్డ్ జనరేషన్ చాలా బలంగా వస్తోంది, పాత తరం మరిన్ని జ్ఞాపకాలను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని విరాట్ పేర్కొన్నారు.
ఆ ఇద్దరి వల్లే గెలిచాం: రజత్ పటీదార్
కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ అద్భుతమైన బౌలింగ్‌తోనే IPL 2025 సీజన్‌లో శుభారంభం చేశామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో ఈ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. 13వ ఓవర్ నుంచి వారు ధైర్యంతో పాటు ఆట పట్ల అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపాడు. అలానే విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు జట్టులో ఉండటం కలిసొచ్చే అంశమని పటీదార్ అన్నాడు.
అందుకే ఓడాం: రహానే
తొలి మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిన సంగతి తెలిసిందే. తమ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిలార్డర్, లోయరార్డర్ బ్యాటింగ్ వైఫల్యం విజయావకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో వరుసగా 2-3 వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని అన్నాడు. బ్యాటర్లు తమ అత్యుత్తమ షాట్లను ఆడే ప్రయత్నం చేశారని, కానీ ఫలితం దక్కలేదని తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com