ICC: వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ నెంబర్ వన్

ICC: వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ నెంబర్ వన్
X
టాప్‌ 4 లోకి వచ్చేసిన కింగ్ కోహ్లీ... రెండు స్థానాలు దిగజారిన హిట్‌మ్యాన్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. 791 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఇక, తాజాగా CT 2025లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి ఎగబాకాడు. కోహ్లీ ఇటీవలే వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అతడు మరో స్థానం మెరుగుపరుచుకుని నాలుగో స్థానంలోకి వచ్చాడు. CT 2025లో భాగంగా ఆసీస్ తో జరిగిన సెమీస్ పోరులో మంచి ప్రదర్శన తర్వాత ఒక స్థానం ఎగబాకాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 747 రేటింగ్ పాయింట్లతో నిలిచాడు. కానీ రోహిత్ శర్మ మూడో స్థానం నుంచి 2 ర్యాంకులు కిందకి పడిపోయాడు. అలాగే ICC వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

టాస్ ఓడిపోయినా పర్వాలేదు: రోహిత్

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా సత్తా చాటుతోంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టు ప్రతి మ్యాచ్‌లో కూడా టాస్ ఓడిపోయింది. ఈ విషయంపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. 'మేము ముందుగా బ్యాటింగ్ చేయడం అనుకూలంగా ఉంది. ప్రత్యర్థి బౌలింగ్ ఎంపిక కూడా బాగుంది. ఈ మైదానంలో గత మూడు మ్యాచ్‌లలో వికెట్లు ముఖ్యమైన పాత్ర పోషించాయి. కాబట్టి టాస్ ఓడిపోయినా నాకు ఎలాంటి టెన్షన్ లేదు.' అని రోహిత్ అన్నారు.

టీమిండియా రిలాక్స్‌

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి CT ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తుది పోరుకు మరో నాలుగు రోజుల సమయం ఉందని, ఈ క్రమంలో తన సహచరులకు రిలాక్స్‌ కావాలని సూచించినట్లు వెల్లడించాడు. సో టీమిండియా ఆటగాళ్లు మార్చి 9 వరకు రిలాక్స్‌ కానున్నారు.

రోహిత్‌పై గౌతమ్‌ గంభీర్‌‌ కీలక వ్యాఖ్యలు

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నా, అతని బ్యాటింగ్ ఫామ్‌పై విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే, సెమీ ఫైనల్ విజయం అనంతరం ఇంటర్వ్యూలో కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పరుగులు చేయడం ముఖ్యం కాదు, కెప్టెన్‌గా టీమ్‌పై రోహిత్ ప్రభావం ఎంతగా ఉందనేది ముఖ్యం.' అంటూ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.

Tags

Next Story