ASHWIN: టీమిండియా ఆటగాళ్ల భావోద్వేగం

భారత స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అశ్విన్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.. కాగా కోహ్లీ ట్వీట్‌లో '14 ఏళ్ల పాటు నీతో కలిసి ఆడా. ఈరోజు రిటైర్మెంట్ గురించి నువ్వు చెబుతుంటే నేనెంతో భావోద్వేగానికి గురయ్యా. నీతో చేసిన ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేశా. అభిమానులకు ఎప్పుడూ గుర్తుండిపోతావు. ఇకపై నీ జీవితం మరింత ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని విరాట్ అన్నారు. భారత క్రికెట్‌కు మీ నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ కంట్రిబ్యూషన్‌లు మరువలేనివి. మీరు భారతీయ క్రికెట్‌లో ఎప్పటికీ. ఎల్లప్పుడూ ఒక లెజెండ్‌గా గుర్తుండిపోతారు. మీకు మీ కుటుంభానికి, మీ సన్నిహితులకు అపారమైన గౌరవం, ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రమా అశ్విన్" అంటూ కోహ్లీ రాసుకొచ్చారు.
అశ్విన్ నిర్ణయం అప్పుడే తెలిసింది: రోహిత్ శర్మ
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ‘అశ్విన్ తీసుకున్న నిర్ణయం నేను పెర్త్‌కు వచ్చినప్పుడే తెలిసింది. ఆ టెస్టు జరుగుతున్నప్పుడు నేను లేను. అప్పట్నుంచే అతడు వీడ్కోలు చెబుదామనుకుంటున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతం. దానిని గౌరవిస్తాం. అన్నింటికీ అశ్వినే సమాధానం ఇస్తారు' అని రోహిత్ తెలిపారు.
తప్పుపట్టిన గవాస్కర్
గబ్బా టెస్ట్ ఫలితం తర్వాత భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి టీమిండియా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ ఊహించని పరిణామంతో మాజీలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడాన్ని తప్పుపట్టారు. సిరీస్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com