18 నెంబర్ తో కాస్మిక్ ఎనర్జీ: కోహ్లీ

18 నెంబర్ తో కాస్మిక్ ఎనర్జీ: కోహ్లీ
సినిమా తారలకే కాదు క్రీడాకారులకు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ మాట కొస్తే ప్రతి మనిషికి అంతో ఇంతో సెంటిమెంట్ కచ్చితంగా ఉంటుంది.

సినిమా తారలకే కాదు క్రీడాకారులకు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ మాట కొస్తే ప్రతి మనిషికి అంతో ఇంతో సెంటిమెంట్ కచ్చితంగా ఉంటుంది. భారత క్రికెట్‌లో సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 వెనుక ఉన్నకధ గురించి మాట్లాడాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. IPL ప్లేఆఫ్స్ రేసులో అత్యంత ముఖ్యమైన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి సెంచరీ కొట్టాడు.

విరాట్ కోహ్లి ఇటీవల తన క్రికెట్ మరియు జీవిత ప్రయాణంలో 18వ నంబర్‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి మీడియాతో పంచుకున్నాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడటానికి ముందు ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

నిజం చెప్పాలంటే నాకు అప్పుడు 18 ఏళ్లు. నేను ఇండియా తరపున U-19 జెర్సీని మొదటిసారి వేసుకున్నప్పుడు నాకు ఇచ్చిన నంబర్‌ ఇది. అక్కడి నుంచే ప్రారంభమైంది 18 నెంబర్ తో నా అనుబంధం. మొదటి సారి నా పేరు, నంబర్ వెనుక వైపు వచ్చింది నాకు 18 వచ్చింది.

“ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన సంఖ్యగా మారింది. భారతదేశం కోసం నా తొలి ఆట ఆగస్ట్ 18, 2008న జరిగింది. మా నాన్న డిసెంబర్ 18, 2006న కన్నుమూశారు. ఆ రెండు నా జీవితంలో చాలా ముఖ్యమైన తేదీలు.

ఈ నంబర్‌తో విశ్వానికి కనెక్టై ఉండాలి. నేను ఒకరోజు ఈ స్థితిలో ఉంటానని ఎప్పుడూ ఊహించలేదు.ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. నేను నిజంగా ఆశీర్వదించబడినట్లు భావిస్తున్నాను" అని కోహ్లీ ముగించాడు.

Tags

Read MoreRead Less
Next Story