VIRAT KOHLI: చరిత్ర సృష్టించిన రన్ మెషిన్

భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) ర్యాంకింగ్స్‌లో మెగా రికార్డును నెలకొల్పిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) 900+ రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తన టీ20ఐ రేటింగ్స్‌ను అప్డేట్ చేసింది. ఈ అప్డేట్లో విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ టీ20ఐ రేటింగ్ 897 నుంచి 909 పాయింట్లకు పెరిగింది. దీంతో అతను టెస్టుల్లో (937), వన్డేల్లో (911), ఇప్పుడు టీ20ల్లో (909) కూడా 900+ రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని రికార్డు. విరాట్ కోహ్లీ సాధించిన రేటింగ్ పాయింట్లు: టెస్టులు: 937 పాయింట్లు (భారత బ్యాట్స్మెన్లలో అత్యధికం, ఆల్‌టైమ్ 11వ అత్యధికం) - 2018లో ఇంగ్లండ్ పర్యటనలో సాధించాడు. వన్డేలు: 911 పాయింట్లు - 2018లో ఇంగ్లండ్ పర్యటనలో సాధించాడు. టీ20లు: 909 పాయింట్లు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు, ఆపై ఇటీవల టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, కేవలం వన్డే క్రికెట్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అయితే, టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయినప్పటికీ, అతని ఆటతీరు, నిలకడ ఇప్పటికీ ప్రపంచ స్థాయిలోనే ఉన్నాయని ఈ ఐసీసీ రికార్డు నిరూపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com