KOHLI: రూ.110 కోట్ల ఒప్పందం వదిలేసిన కోహ్లీ

KOHLI: రూ.110 కోట్ల ఒప్పందం వదిలేసిన కోహ్లీ
X
పూమాతో ఎనిమిదేళ్ల బంధానికి విరాట్ స్వస్తి

టీమిండియా స్టార్ బ్యాటర్.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమాతో తన రూ.110 కోట్ల ఒప్పందానికి ముగింపు పలికాడు. కోహ్లీ పూమా బ్రాండ్‌తో ఎనిమిదేళ్ల అనుబంధం కలిగి ఉన్నాడు. పూమా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విరాట్ కోహ్లీ.. రూ.110 కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్నాడు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఈ డీల్‌ను వదులుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది. విరాట్ కోహ్లీ ఇప్పుడు బిజినెస్ రంగంలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన సొంత బ్రాండ్ అయిన వన్8 కంపెనీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. స్పోర్ట్స్‌వేర్, ఫుట్ వేర్, దుస్తులు వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న వన్ 8ను మరింత విస్తరించేందుకు విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

అజిలిటాస్ లో కోహ్లీ పెట్టుబడి

కోహ్లీ క్రీడా అథ్లెటర్ కంపెనీ అజిలిటాస్ లో పెట్టుబడిదారుడిగా చేరనున్నట్లు తెలుస్తోంది. అజిలిటాస్ కంపెనీని అభిషేక్ గంగూలీ 2023 సంవత్సరంలో ప్రారంభించాడు. అభిషేక్ గతంలో కోహ్లీని పూమాతో పని చేసేలా ఒప్పించాడు. 2017 సంవత్సరం నుంచి కోహ్లీ పూమాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. విరాట్ కోహ్లీకి సొంత బ్రాండ్ వన్8 ఉంది. దీనిని విరాట్ కోహ్లీ 2017 సంవత్సరంలో ప్రారంభించారు. విరాట్ కోహ్లీ ఇప్పుడు తన వన్8 బ్రాండ్ ను అజిలిటాస్ ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అజిలిటాస్ అభివృద్ధిలో వన్8 కీలక భాగస్వామిగా మారుతుంది.

ఐపీఎల్ ప్లేయర్‌పై పాక్‌లో నిషేధం

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కార్బిన్‌ బాష్‌‌పై పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డు నిషేధం విధించింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌‌లో పాల్గొనకుండా ఏడాది పాటు బ్యాన్ విధించింది. కాగా, PSL-2025 సీజన్‌కు గానూ 'పెషావర్‌ జల్మీ' ఫ్రాంఛైజీ బాష్‌ను జట్టులోకి తీసుకుంది. బాష్ అక్కడ ఆడకుండా IPLలో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడికి పీసీబీ ఏడాది పాటు బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ముంబయి ఇండియన్స్ ప్లేయర్ లిజార్డ్ విలియమ్స్ గాయం కారణంగా దూరం కావడంతో కార్బిన్ బాష్​ను రిప్లేస్​మెంట్​గా తీసుకుంది. అయితే ఈ రెండు టోర్నీలు ఒకేసారి జరుగుతుండడం వల్ల కార్బిన్ ఐపీఎల్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో తమతో చేసుకున్న ఒప్పదం ఉల్లంఘించినందుకు పీసీబీ అతడికి లీగల్ నోటీసులు పంపింది. కార్బిన్​పై ఏడాది నిషేధం విధించింది.

Tags

Next Story