Virat Kohli vs Dhoni : అ ఒక్కటే తప్ప.. ధోనితో పోలిస్తే కోహ్లీనే బెటర్..!

త్వరలో దుబాయ్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కి గుడ్‌బై చెప్పనున్నట్లుగా టీంఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం కోహ్లీ అభిమానులను మాత్రమే కాదు యావత్ క్రికెట్ అభిమానులను షాక్‌కి గురి చేసింది. కోహ్లీ నిర్ణయాన్ని కొందరు సమర్ధిస్తుండగా మరికొందరు మాత్రం కోహ్లీ అనవసరంగా ఆవేశపడ్డాడని అంటున్నారు.
మాజీ ఆటగాడు, కెప్టెన్ ధోని నుంచి నాయకత్వ బాధ్యతలను తీసుకున్న కోహ్లీ కెప్టెన్‌గా బాగానే సక్సెస్ అయ్యాడు. టీ20లో కెప్టెన్‌గా కోహ్లీకి గణనీయమైన రికార్డే ఉంది. కానీ అతని ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేకపోవడమే ఓ మచ్చగా మిగిలిపోయింది. ఇదొక్కటి మినహాయిస్తే ధోని కంటే కోహ్లీనే బెటర్ అని.. ఇందుకు గణాంకాలే పెద్ద ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఒక్కసారి కోహ్లీ టీ20 రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకూ కోహ్లి సారథ్యంలో టీమిండియా జట్టు మొత్తం 45 టీ20 మ్యాచ్‌లు ఆడగా అందులో 27 మ్యాచ్‌ల్లో విజయ డంఖా మోగించింది. మొత్తం టీ20లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ముందుగా ఈ లిస్టులో అఫ్గనిస్తాన్ సారధి అస్గర్ అఫ్గాన్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాలలో ఫాఫ్ డుప్లెసిస్, ఇయాన్ మోర్గాన్, డారెన్ స్యామీ, ధోని ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com