Aus vs Eng: చివరి రోజు ఎవరిదో, ఆసక్తికరంగా చివరి టెస్ట్..

Aus vs Eng: చివరి రోజు ఎవరిదో, ఆసక్తికరంగా చివరి టెస్ట్..
X
భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకి ఓపెనర్లు శుభారంభాన్నందించారు. 38 ఓవర్ల పాటు సాగిన చివరి ఇన్సింగ్స్‌లో ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించారు.

Ashes 5th Test: యాషెస్ సిరీస్‌ చివరి టెస్ట్ మరోసారి ఆసక్తికరంగా మారింది. విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడుతోంది. 384 పరుగుల ఆధిక్యం సాధించడంతో ఇంగ్లాండ్‌కి విజయం కష్టం కాదనిపించగా, లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా వికెట్‌ ఏమీ కోల్పోకుండా 135 పరుగులు చేసింది. విజయానికి పరుగుల దూరంలో నిలవడంతో మరో మలుపు తిరిగింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఖవాజా(130 బంతుల్లో 69, 8x4), డేవిడ్ వార్నర్‌(99 బంతుల్లో 58, 9x4)లు క్రీజులో ఉన్నారు.

వర్షం కారణంగా 4వ రోజు ఎక్కువ భాగం తుడుచుపెట్టకుపోయింది. మొత్తంగా 40 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆదివారం 389/9 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో కొనసాగించిన ఇంగ్లాండ్, మరో 11 పరుగులు జోడించి చివరి వికెట్‌గా ఆండర్సన్‌ని కోల్పోయింది. ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బ్రాడ్ నాటౌట్‌గా నిలిచాడు.

భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకి ఓపెనర్లు శుభారంభాన్నందించారు. 38 ఓవర్ల పాటు సాగిన చివరి ఇన్సింగ్స్‌లో ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించారు. ఈ సిరీస్‌లో వుసగా విఫలమవుతున్న డేవిడ్ వార్నర్ పట్టుదలతో ఆడుతున్నాడు. చివరి రోజు కూడా వర్ష సూచనలు ఉండటంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిస్తే 2-2తో సిరీస్‌ సమం చేయనుంది.

బ్రాడ్‌కి ఇదే చివరి టెస్ట్ మ్యాచ్..

ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకనున్న స్టువర్ట్ బ్రాడ్‌కి మైదానంలోకి వచ్చే ముందు ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ హానర్ ' తో స్వాగతం పలికారు. చివరి టెస్టులో బ్యాటింగ్‌లో నాటౌట్‌గా నిలిచాడు.

Tags

Next Story