IPL: కీలక మ్యాచ్‌లో ఢిల్లీపై కోల్‌కతా విజయం

IPL: కీలక మ్యాచ్‌లో ఢిల్లీపై కోల్‌కతా విజయం
X
నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసిన కోల్‌కత్తా... 190 పరుగులకే పరిమితమైన ఢిల్లీ

ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌ అభిమానులను అలరించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. దీంతో కోల్‌కత్తా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.**

రాణించిన రఘువంశీ, రింకు సింగ్‌.

**టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం లభించింది. గుర్బాజ్‌ (26) నరైన్‌ (27) వేగంగా ఆడారు. వీరిద్దరూ కేవలం మూడు ఓవర్లలోనే 48 పరుగులు చేశారు. తర్వాత వచ్చిన రహానె (26: 14 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌) సైతం బ్యాటు ఝుళిపించాడు. అనంతరం స్వల్ప తేడాతో వికెట్లు పడ్డాయి. రింకు సింగ్‌ (36: 25 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌)తో కలిసి రఘువంశీ (44: 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కోల్‌కతాను ఆదుకున్నారు.కోల్‌కతా 204 పరుగులు చేసింది.**

ఢిల్లీ పోరాడినా

205 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. అనుకల్‌ రాయ్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ (4) రస్సెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. డుప్లెసిస్‌ (62: 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మారుతున్న ఈ జోడీని నరైన్‌ విడదీశాడు. 136 పరుగుల వద్ద అక్షర్‌ ఔటయ్యాడు. అదే ఓవర్లో స్టబ్స్‌ (1)ను సైతం నరైన్‌ బోల్తా కొట్టించాడు. డుప్లెసిస్‌ పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది.

Tags

Next Story