Ind vs Wi Test: 500వ టెస్టులో కోహ్లీ సెంచరీ, ప్రతిఘటిస్తోన్న విండీస్

WI vs India: తన 500వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ(Virat Kohli) శతకం(206 బంతుల్లో 121, 11x4)తో చెరేగిన వేళ 2వ టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. కోహ్లీ సుమారు నాలుగున్నరేళ్ల తర్వాత విదేశాల్లో సెంచరీ(Away Century) చేయడం విశేషం. ఇది కోహ్లీకి టెస్టుల్లో 29వ సెంచరీ కాగా, వన్డేలతో కలిపి 76వ సెంచరీ. మొదటి ఇన్సింగ్స్‌లో రవీంద్ర జడేజా(61), రవిచంద్ర అశ్విన్(56)లు కూడా అర్ధసెంచరీలతో రాణించడంతో 438 పరుగులు చేసింది.
మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్(37 నాటౌట్), చందర్‌పాల్(33)లు పట్టుదలతో ఆడారు. ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలు పెట్టినప్పటికీ, ప్రతిఘటిస్తూ ఆడారు. భారత్‌కు 35వ ఓవర్లకు గానీ మొదటి వికెట్ లభించలేదు. 35వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో చందర్‌పాల్ ఔటయ్యాడు. మరో 5 ఓవర్లు మాత్రమే ఆటకొనసాగి 2వ రోజును బ్రాత్‌వైట్, మెకంజీ(14)లు మరో వికెట్ పడకుండా ముగించారు. ఇంకా 352 పరుగుల వెనకంజలో ఉంది.
288 పరుగుల ఓవర్‌నైట్‌తో స్కోర్‌తో 2వ రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన జడేజా, విరాట్ కోహ్లీలు విండీస్ బౌలర్లను అలవోకగానే ఎదుర్కొన్నారు. 180 బంతుల్లో స్క్వేర్ డ్రైవ్‌లో బౌండరీ ద్వారా విరాట్ కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం జడేజా కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 99వ ఓవర్లో కష్టమైన సింగిల్ కోసం ప్రయత్నించి రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. జడేజాతో కలిసి కోహ్లీ 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 61 పరుగుల వద్ద కీమర్ రోచ్ బౌలింగ్‌లో అంపైర్ సమీక్ష ద్వారా కీపర్ క్యాచ్ ఔటై వెనుదిరిగాడు. మొదటి సెషన్‌లో 85 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి లంచ్‌కి వెళ్లింది.అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ తన ఖాతా తెరవడానికి 20 బంతులు తీసుకున్నాడు.
లంచ్ నుంచి వచ్చిన 6వ ఓవర్లోనే ఇషాన్ కిషన్‌ను జేసన్ హోల్డర్ వెనక్కి పంపాడు. ఉనద్కత్, మహ్మద్ సిరాజ్‌లు కూడా స్వల్ప పరుగుల వ్యవధిలోనే స్టంపౌట్, ఎల్బీలుగా వెననుదిరిగారు. 75 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అశ్విన్, వేగంగా ఆడే క్రమంలో బౌల్డ్ కావడంతో భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది. విండీస్ బౌలర్లలో రోచ్, వారికాన్‌లు చెరో 3 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా, గాబ్రియేల్ 1 వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com