WFI: లైంగిక వేధింపులు...

WFI: లైంగిక వేధింపులు...
ప్రెసిడెంట్‌ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్న వినేష్‌ ఫొగట్‌; బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజర్ల డిమాండ్‌; జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్ల నిరసన

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫొగట్‌ బుధవారం సంచలన వాఖ్యలు చేసింది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో దేశంలోని స్టార్‌ రెజ్లర్స్‌తో కలిసి నిరసన వ్యక్తం చేసింది. వెంటనే బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

WFI ప్రెసిడెంట్‌ మానసికంగా హించాడని, ఈ నేపథ్యంలో తాను సూసైడ్‌ కూడా చేసుకోవాలనుకున్నానని ఫొగట్‌ తెలిపింది. మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ నిరసనలో ఓలంపిక్‌ మెడలిస్ట్‌ సాక్షి మాలిక్‌, భజరంగ్‌ పునియా కూడా పాల్గొన్నారు. WFI అడ్మినిష్ట్రేషన్‌ను మార్చాలని ప్రధాని మోడీని అలాగే స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

గాయాలపాలైన వారి గురించి ఎవరూ బాధ్యత వహించడంలేదు, కానీ నేషనల్స్‌ నుంచి మాత్రం రెజ్లర్స్‌ను తీసేయాలని మాట్లాడుతున్నారని వాపోయారు. బ్రిజ్‌ భూషణ్‌ తనను దేనికీ పనికిరావని ( ఖోటా సిక్కా) తిట్టాడని, దీని వల్ల ఎంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది. WFI ప్రెసిడెంట్‌పై కంప్లైంట్‌ చేస్తే చంపేస్తామంటూ తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, వాటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది.



Tags

Read MoreRead Less
Next Story